కన్ఫ్యూజన్‌లో పవన్.. పోటీపై నో క్లారిటీ.!
పవన్‌కల్యాణ్ తాజాగా 5 స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేశారు. కానీ స్వయంగా తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాననే దానిపై క్లారిటీ ఇవ్వలేకపోయారు పవన్.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గందరగోళంలో ఉన్నారా..! అవును..ప్రస్తుత పరిస్థితి చూస్తే అదే నిజమనిపిస్తోంది. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీని కనీసం సీట్లు డిమాండ్ చేయలేదని తాజా జాబితాను చూస్తే అర్థమవుతోంది. ఒకరకంగా సొంత పార్టీ నేతలు, జనసైనికుల మనోభావాలకు కనీస విలువ ఇవ్వలేదని తెలుస్తోంది.
తెలుగుదేశం,పచ్చ మీడియా ప్రచారం చేసినట్లుగానే జనసేనాని కేవలం 24 సీట్లు, 3 పార్లమెంట్ స్థానాలకు అంగీకరించారు. బీజేపీ కలిసి రాకపోతే జనసేనకు మరికొన్ని సీట్లు పెరిగే అవకాశముంది. ఇక బీజేపీ కూడా కూటమితో కలిసి పోటీ చేస్తే జనసేనకు ఈ సీట్లే దాదాపు ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయి.
ఇక పవన్‌కల్యాణ్ తాజాగా 5 స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేశారు. కానీ స్వయంగా తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాననే దానిపై క్లారిటీ ఇవ్వలేకపోయారు పవన్. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ రెండు చోట్ల ఓడిపోయారు.