రైల్వేస్టేషన్ లిఫ్టులో ఇరుక్కున్న ప్రయాణికులు.. 3 గంటలు నరకయాతన
మార్కాపురం రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు.
BY Vamshi Kotas2 Feb 2025 12:06 PM IST
X
Vamshi Kotas Updated On: 2 Feb 2025 12:06 PM IST
ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. ప్లాట్‌ఫారం మారేందుకు 14 మంది లిఫ్టు ఎక్కారు. పరిమితికి మించి ఎక్కడంతో లిఫ్టు ఆగిపోవడంతో పాటు తలుపులు తెరుచుకోలేదు. దీంతో ప్రయాణికులు 3 గంటల పాటు అందులో ఇబ్బందులు పడ్డారు. వారి కేకలు విని రైల్వే పోలీసులు స్పందించారు. టెక్నీషియన్లు లేకపోవడంతో వారే స్వయంగా రంగంలోకి దిగారు.టెక్నీషియన్లు అందుబాటులో లేకపోవడంతో పోలీసులే స్వయంగా రంగంలోకి దిగారు. లిఫ్ట్ పైనుంచి లోపలికి దిగి, ఎమర్జెన్సీ మార్గంలో ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన 14 మందిని క్షేమంగా బయటకు తెచ్చారు. లిఫ్ట్ లో చిక్కుకుపోయిన ప్రయాణికులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Next Story