Telugu Global
Andhra Pradesh

హిందూపురంపై పరిపూర్ణానంద పట్టు.. ఇండిపెండెంట్‌గా బరిలోకి..?

హిందూపురం ఎంపీ అభ్యర్థి విషయంలో అధిష్టానం పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ టికెట్‌ ఇస్తే పోటీ చేస్తానని.. లేదంటే ఇండిపెండెంట్‌గానైనా బరిలో ఉంటానని శపథం చేస్తున్నారు.

హిందూపురంపై పరిపూర్ణానంద పట్టు.. ఇండిపెండెంట్‌గా బరిలోకి..?
X

ఏపీలో తెలుగుదేశం, బీజేపీ మధ్య విశాఖ పార్లమెంటు సీటుపై వివాదం కొనసాగుతుండగా.. హిందూపురం సీటుపైనా రచ్చ మొదలైంది. బీజేపీ నేత పరిపూర్ణానంద స్వామీజీ హిందూపురం సీటు కోసం పట్టుబడుతున్నారు.

హిందూపురం ఎంపీ అభ్యర్థి విషయంలో అధిష్టానం పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ టికెట్‌ ఇస్తే పోటీ చేస్తానని.. లేదంటే ఇండిపెండెంట్‌గానైనా బరిలో ఉంటానని శపథం చేస్తున్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే పరిస్థితే లేదన్నారు. ఈ విషయంలో కాంప్రమైజ్ అయితే కాషాయ వస్త్రాలకు విలువే లేదన్నారు పరిపూర్ణానంద. ఒక్క అవకాశం ఇస్తే హిందూపురంను అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.

హిందూపురం సీటుపై మొదటి నుంచి ఆశలు పెట్టుకున్నారు పరిపూర్ణానంద. బీజేపీ అధిష్టానం ఆ సీటు తనకు ఇచ్చేందుకు ఓకే చెప్పినప్పటికీ.. సీటును వదులుకోవడానికి టీడీపీ ముందుకురాలేదన్నారు పరిపూర్ణానంద. పొత్తులో భాగంగా ఈ సీటును తీసుకున్న టీడీపీ.. బి.కె.పార్థసారథిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. మైనార్టీ ఓట్లు దూరమవుతాయన్న భయంతోనే టీడీపీ ఇలా చేసి ఉండొచ్చని పరిపూర్ణానంద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హిందూపురంలో హిందూ అనే పదం ఉందని.. అందుకే తాను ఈ స్థానాన్ని ఎంచుకున్నానని చెప్పారు పరిపూర్ణానంద.

First Published:  7 April 2024 5:16 AM GMT
Next Story