Telugu Global
Andhra Pradesh

నాడు బాలయ్య.. నేడు సీబీఎన్‌.. అరెస్టు వెనుక ఆ ఒక్కడే..!

ఎలాంటి విచారణ లేకుండా బయటపడ్డ చంద్రబాబును తొలిసారి జైలు జీవితం గడిపేలా చేసింది కూడా సంజయే కావడం విశేషం.

నాడు బాలయ్య.. నేడు సీబీఎన్‌.. అరెస్టు వెనుక ఆ ఒక్కడే..!
X

తెలుగుదేశం అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే ఈ అరెస్టు వెనుక సీఐడీ కీలక పాత్ర పోషించింది. ఇప్పటి సీఐడీ చీఫ్‌ సంజయ్‌ గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన పేరు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. 2004లో వైఎస్సార్‌ సీఎంగా ఉన్న టైంలో ఓ కాల్పుల కేసులో చంద్రబాబు నాయుడు బావమరిది బాలకృష్ణను అరెస్టు చేసింది ఈయనే.

ఇక గతంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ.. ఎలాంటి విచారణ లేకుండా బయటపడ్డ చంద్రబాబును తొలిసారి జైలు జీవితం గడిపేలా చేసింది కూడా సంజయే కావడం విశేషం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్‌కు అడిషనల్ డీజీపీగా సారథ్యం వహిస్తున్న సంజయ్‌.. 1996 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆఫీసర్‌. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో రూ.371 కోట్ల మేర అవినీతి జరిగిందని పేర్కొంటూ.. ఈ నెల 9న చంద్రబాబును అరెస్టు చేయడంతో సంజయ్‌ పేరు సంచలనంగా మారింది.

గతంలో హైదరాబాద్‌ వెస్ట్ జోన్‌ డిప్యూటీ కమిషనర్ ఆఫ్‌ పోలీస్‌గా పని చేశారు. అదే టైంలో ఓ జంటపై బాలకృష్ణ కాల్పులు జరిపారన్న కేసులో కీలక ఆధారాలు సేకరించారు. ఈ ఘటన 2004లో జరిగింది. ప్రస్తుతం బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు.

First Published:  11 Sept 2023 9:39 AM IST
Next Story