రూ.100 ఎన్టీఆర్ నాణెం.. అసలు ధర తెలిస్తే షాక్
ఈరోజు ఉదయం 10గంటలనుంచి ఎన్టీఆర్ నాణెం ఆన్ లైన్ లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. https://www.indiagovtmint.in/en/commemorative-coins/ అనే లింకు ఓపెన్ చేసి ఈ నాణెంకు సొమ్ము చెల్లించి ఇంటికి తెప్పించుకోవచ్చు.
ఎన్టీఆర్ పేరిట 100 రూపాయల స్మారక నాణెం విడుదలైన విషయం తెలిసిందే. ఆ నాణెం వెనక రాజకీయం గురించి వదిలేస్తే.. అసలు దాన్ని ఎలా సొంతం చేసుకోవాలి, ఎక్కడ దొరుకుతుంది అని చాలామంది ఆరా తీసి ఉంటారు. ఎన్టీఆర్ నాణెంతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకోవాలని కూడా చాలామంది ఉబలాటపడి ఉంటారు. అయితే అది అనుకున్నంత సులభం కాదు, కాస్త ఖర్చుతో కూడుకున్న పని. అవును ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం ఖరీదు 100 కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఆ నాణెం మన జేబులోకి రావాలంటే దాదాపు రూ.5వేలు ఖర్చు పెట్టాల్సిందే.
మూడు రకాల విలువ
చెక్క డబ్బాతో కలిసి నాణెం ధర రూ.4,850
ప్రూఫ్ ఫోల్డర్ ప్యాక్ లో ఉంటే రూ.4,380
యు.ఎస్.సి. ఫోల్డర్ ప్యాక్ లో ఉంటే రూ.4,050
ఇవీ ఆ నాణెం ధరలు. అంటే ఎన్టీఆర్ నాణెం ముఖ విలువ రూ.100 అయినా కూడా దాన్ని తయారు చేసింది మిగతా నాణేలు తయారు చేసిన లోహంతో కాదు కాబట్టి.. ఆ రేటు ఉంటుంది. ఎన్టీఆర్ నాణెం తయారీలో 50శాతం వెండి, 40శాతం రాగి, 5శాతం జింక్, 5శాతం నికెల్ ఉపయోగించారు. అందుకే దీని ఖరీదు ఎక్కువ.
ఎలా సొంతం చేసుకోవాలి..?
ఈరోజు ఉదయం 10గంటలనుంచి ఎన్టీఆర్ నాణెం ఆన్ లైన్ లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. https://www.indiagovtmint.in/en/commemorative-coins/ అనే లింకు ఓపెన్ చేసి ఈ నాణెంకు సొమ్ము చెల్లించి ఇంటికి తెప్పించుకోవచ్చు. లేదా హైదరాబాద్ లోని సైఫాబాద్, చెర్లపల్లిల్లోని మింట్ సేల్స్ కౌంటర్లలో నేరుగా కొనుగోలు చేయొచ్చు.