ఎన్నికల బరిలో ఎన్నారై పందెం కోళ్లు
వచ్చే ఎన్నికల్లో ఏపీలో వివిధ నియోజకవర్గాల సీట్లు ఆశిస్తున్న ఎన్నారైల సంఖ్య బాగానే పెరిగింది. ఈసారి టిడిపి గాలి వీయొచ్చనే అంచనాలతో చాలా మంది ఎన్నారైలు టిడిపి టికెట్ కోసం అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఏపీలో సంక్రాంతి కోడిపందేలు బాగా ఫేమస్. సంక్రాంతికి ముందు ఎన్నారై పందెం కోళ్లు ఎన్నికల బరి కోసం కాళ్లు దువ్వుతున్నాయి. రెక్కలు విదుల్చుతున్నాయి. గతం నుంచీ ప్రవాస తెలుగు వారు తమ స్వరాష్ట్రంలో రాజకీయాల పట్ల ఆసక్తి బాగానే కనబరుస్తున్నారు. కొందరు విదేశాలు వదిలి ఏదో ఒక పార్టీ పంచన చేరి అభ్యర్థులుగా బరిలోకి దిగారు. కొందరు గెలిచారు. కొందరు ఓడి తెరమరుగయ్యారు.
వచ్చే ఎన్నికల్లో ఏపీలో వివిధ నియోజకవర్గాల సీట్లు ఆశిస్తున్న ఎన్నారైల సంఖ్య బాగానే పెరిగింది. ఈసారి టిడిపి గాలి వీయొచ్చనే అంచనాలతో చాలా మంది ఎన్నారైలు టిడిపి టికెట్ కోసం అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టారు. గుంటూరులో చంద్రన్న కానుకలు పంపిణీ చేసిన ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ టిడిపి టికెట్ ఆశిస్తున్నారు. వెనిగండ్ల రాము కూడా గుడివాడలో ఓ ట్రస్ట్ ఏర్పాటుచేసి సేవాకార్యక్రమాలు ప్రారంభించారు. ఈయన కూడా గుడివాడ టిడిపి టికెట్ రేసులో వున్నారని టాక్. విశాఖ జిల్లా మాడుగుల టికెట్ కోసం గత ఎన్నికల్లోనూ ప్రయత్నించిన ఎన్నారై పైలా ప్రసాద్.. మళ్లీ సీటు వేట మొదలు పెట్టారు. టిడిపి కోసం ఏళ్లుగా పనిచేస్తున్న కోమటి జయరాం కూడా ఈ ఎన్నికల్లో సీటు ఆశిస్తున్నారని సమాచారం.