Telugu Global
Andhra Pradesh

ఓట్లు కొనేద్దాం.. ఎన్నారై టీడీపీ సెల్ పిలుపు

ఓటర్లని వెధవలు అంటూ సంబోధించిన కోమటి జయరాం.. గ్రామాల్లో ఓట్లను కొనేందుకు ఎన్నారై విభాగం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఓట్లు కొనేద్దాం.. ఎన్నారై టీడీపీ సెల్ పిలుపు
X

ఏపీలో ఎన్నికలకు టైమ్ దగ్గరపడేకొద్దీ కుట్రలు, కుతంత్రాలు అన్నీ వెలుగులోకి వస్తున్నాయి. సీఎం జగన్ ఒక్కరే ఇటువైపు ఉన్నారు. అటువైపు కూటమితోపాటు వారికి లోపాయికారీగా కాంగ్రెస్ సహకరిస్తుండగా, ఇటీవల కొత్తగా చిరంజీవి కూడా ఆ బ్యాచ్ లో జాయిన్ అయ్యారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, నేరుగా ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకి టీడీపీ ఎన్నారై సెల్ ఇచ్చిన పిలుపు ఇప్పుడు వైరల్ గా మారింది. టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కో-ఆర్డినేటర్ కోమటి జయరాం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ని కోరారు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్.


వెధవల్ని కొనేద్దాం..!

ఓటర్లని వెధవలు అంటూ సంబోధించిన కోమటి జయరాం.. గ్రామాల్లో ఓట్లను కొనేందుకు ఎన్నారై విభాగం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కనీసం ప్రతి నియోజకవర్గంలో తమ తరపున వెయ్యి కుటుంబాల ఓట్లు కొనుగోలు చేయాలని అన్నారు జయరాం. వైసీపీకి చెందిన ఫ్యామిలీలకు రూ.3 లేదా 4 లక్షలు ఇచ్చి ఓట్లు వేయించుకుంటామన్నారు. టీడీపీ కార్యాలయం వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

బరితెగింపు..

సిద్ధం సభలతో ఒక్కసారిగా వైసీపీలో జోష్ పెరిగింది. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర దానికి కొనసాగింపుగా మరింత విజయవంతంగా సాగుతోంది. ఇక మేనిఫెస్టో విడుదలైతే టీడీపీ పని గల్లంతేననే ప్రచారం జరుగుతోంది. పైగా ఇటీవల సీఎం జగన్ పై జరిగిన హత్యాయత్నం కూడా టీడీపీకి తీవ్ర నష్టం కలిగించింది. జగన్ కి పెరుగుతున్న ప్రజాదరణను ఎలా అడ్డుకోవాలనే ప్రయత్నాల్లో భాగంగానే ఇలా ఓటుకు నోటు వ్యవహారం తెరపైకి వచ్చిందని అంటున్నారు వైసీపీ నేతలు. టీడీపీ కుట్రలు బయటపడ్డాయని ఎన్నికల కమిషన్ ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

First Published:  21 April 2024 8:15 PM IST
Next Story