ముఖ్య గమనిక: నారా లోకేష్ పాద యాత్రలో ముద్దులు లేవు
లోకేష్ పాదయాత్ర కు సంబంధించిన లోగోతో పాటు యువగళం జెండాను ఆ పార్టీ సీనియర్ నేతలు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం టీడీపీ నేత అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ... లోకేష్ పాద యాత్రలో ముద్దులు పెట్టుకోవడాలు, షాంపూలతో తల రుద్దడాలు ఉండవని అన్నారు. జగన్ పాద యాత్ర తరహాలో ఆడంబరాలేమీ ఉండవని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ నాయకుడు , చంద్రబాబు నాయుడి కుమారుడు నారాలోకేష్ పాద యాత్ర ప్రారంభమయ్యే తేదీ, ప్లేస్, పాద యాత్ర పేరు డిసైడ్ అయ్యాయి. యువ గళం పేరుతో ప్రారంభమయ్యే ఈ యాత్ర 2023, జనవరి 27వ తేదీన కుప్పం నుంచి ప్రారంభమవుతుంది.
ఈ సందర్భంగా లోకేష్ పాదయాత్ర కు సంబంధించిన లోగోతో పాటు యువగళం జెండాను ఆ పార్టీ సీనియర్ నేతలు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం టీడీపీ నేత అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ... లోకేష్ పాద యాత్రలో ముద్దులు పెట్టుకోవడాలు, షాంపూలతో తల రుద్దడాలు ఉండవని అన్నారు. జగన్ పాద యాత్ర తరహాలో ఆడంబరాలేమీ ఉండవని చెప్పారు.
లోకేష్ యాత్ర 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర సాగుతుందని అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, యువత మత్తు మందులకు భానిసలైపోతున్నారని, ఉపాధి, ఉద్యోగాలు లేక యువత పక్కదారి పడుతున్నారని మండిపడ్డారాయన. ఇలాంటి యువతకు భరోసా ఇచ్చేందుకే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు అచ్చెన్నాయుడు.
అచ్చెన్నాయుడు మాటలపై సోషల్ మీడియాలో అప్పుడే ట్రోలింగ్ మొదలైంది. లోకేష్ పాద యాత్ర గురించి వివరాలు చెప్పేంతవరకు బాగానే ఉంది కానీ, ముద్దుల గురించి, తల రుద్దడాల గురించి మాట్లాడటం చీప్ గా ఉందని నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంపై ఒక్క అచ్చెన్నానాయుడినే కాకుండా నెటిజనులు లోకేష్ ను కూడాట్రోల్ చేస్తున్నారు.