గత వైసీపీ ప్రభుత్వ అక్రమాలుపై చర్యలేవీ : షర్మిల
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలుపై చర్యలు తీసుకోవడంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలమండిపడ్డారు.
కూటమి ప్రభుత్వంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలుపై చర్యలు తీసుకోవడంపై మండిపడ్డారు. ఇవాళ విజయవాడలో వైఎస్ షర్మిల విలేకర్లతో మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్‌గా మారితే.. వాటిని చూసి మౌనం వహించడం కూటమి ప్రభుత్వం ట్రెండ్‌గా పెట్టుకుందని ఆమె వ్యంగ్యంగా పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి 6 నెలలైనా గత ప్రభుత్వం ధారాదత్తం చేసిన ఆస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. గంగవరం పోర్టును గత ప్రభుత్వం అదానీకి రాసిచ్చిందని, తిరిగి వాటాను వెనక్కు తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న బియ్యం అక్రమ రవాణా పై ఆమె నిన్న మాట్లాడిన విషయం తెలిసిందే..బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్ కింద ఇంకో 15 ఏళ్లలో పూర్తిగా ప్రభుత్వపరం అవ్వాల్సిన పోర్టు అదని వివరించారు. పైగా అదానీకి కట్టబెట్టేటప్పుడు ఎలాంటి టెండర్లు లేవని... కళ్ళు మూసీ తెరిచేలోగా అన్ని అనుమతులు ఇచ్చేశారన్నారు. పైగా మిగతా పోర్టుల అభివృద్ధికి ఆ నిధులు ఉపయోగమని బుకాయించారని గత వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్షంలో ఉండగా గంగవరం పోర్టుపై చెప్పిన మీ మాటలకు, ఇచ్చిన హామీలకు.. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాలకు ఎంత మాత్రం పొంతన లేదన్నారు. గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న వాటాను వెనక్కు తీసుకొనే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్బంగా కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.