మళ్లీ జగనే సీఎం.. టీడీపీకి షాక్.. సంచలన సర్వే
న్యూస్ ఎరెనా ఇండియా సంస్థ తాజాగా తన ప్రీ-పోల్ సర్వే ఫలితాలను విడుదల చేసింది. 49.4 శాతం ఓట్లతో వైసీపీ 122 స్థానాలను గెలుచుకుంటుందని స్పష్టం చేసింది.
ఏపీలో వైఎస్ జగన్ ప్రభంజనమే. రెండో సారి YSRCP విజయం ఖాయం. అవును అన్ని సర్వే సంస్థలు చెప్తున్న విషయమిదే. తాజాగా మరో సర్వే ఫలితాలు విడుదలయ్యాయి. వరుసగా రెండోసారి సీఎం పదవిని జగన్ అధిష్టించడం ఖాయమేనని న్యూస్ ఎరెనా ఇండియా సంస్థ తేల్చి చెప్పింది.
న్యూస్ ఎరెనా ఇండియా సంస్థ తాజాగా తన ప్రీ-పోల్ సర్వే ఫలితాలను విడుదల చేసింది. 49.4 శాతం ఓట్లతో వైసీపీ 122 స్థానాలను గెలుచుకుంటుందని స్పష్టం చేసింది. ఇక తెలుగుదేశం, జనసేన కూటమి 44.34 ఓటింగ్ శాతంతో 53 స్థానాలకు పరిమితమవుతుందని అంచనా వేసింది. ఇక రెండు జాతీయ పార్టీలో ఏపీలో అవమానకర స్థితిలో పరాభవాన్ని మూటగట్టుకుంటాయని తేల్చి చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 88 వేల 700 మందిని సర్వే చేసి ఈ ఫలితాలు వెల్లడించింది NAI సంస్థ.
Again and again, every survey says it’s @ysjagan again in Andhra Pradesh. #YSJaganAgain#YSRCPAgain#EndOfTDP https://t.co/NrOzxjCpLi
— YSR Congress Party (@YSRCParty) February 1, 2024
సంక్షేమ పథకాలు, ఆరోగ్యం, విద్యారంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన, సీనియర్ సిటిజన్లకు పెన్షన్ డోర్ డెలివరీతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రాజకీయ ప్రాతినిథ్యం కల్పించడం వైసీపీకి ప్లస్ పాయింట్స్‌గా ఉన్నాయని సర్వే తెలిపింది. నిత్యావసర ధరల పెరుగుదల, కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేల వైఖరిపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని తేల్చింది.
ఇక జిల్లాల వారీగా తెలుగుదేశం బలంగా ఉందని భావించే కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ మెజార్టీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని సర్వే అంచనా వేసింది. ఇక రాయలసీమలో మరోసారి తెలుగుదేశం సింగిల్ డిజిట్ స్థానాలకే పరిమితమవుతుందని తేల్చింది.