బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ
చంద్రబాబుపై ఫైర్ అయిన వైఎస్ జగన్

ఎన్నికలకు ముందు బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ అన్నారు. ఎన్నికలు అయిపోయాక బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ అన్న తీరుగా వ్యవహరిస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..అసెంబ్లీలో ప్రతిపక్షం మాటలు వినే పరిస్థితి లేదు. అందుకే మీడియా ముందుకు వచ్చాం. చంద్రబాబు ప్రభుత్వం రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టింది. రెండు బడ్జెట్‌లలోనూ చంద్రబాబు ప్రజలను మోసం చేసే తీరు స్పష్టంగా కనిపిస్తున్నదని ధ్వజమెత్తారు. ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ఊదరగొట్టారు. దత్తపుత్రుడితో కలిసి మేనిఫెస్టో విడుదల చేశారు. మేనిఫోస్టో హామీలపై అడిగితే సమాధానం లేదు. ప్రతి ఇంటికి బాండ్లు కూడా పంచారు. చంద్రబాబు ఇచ్చింది ఎంతంఏ బోడి సున్నా కనిపిస్తున్నదని ఎద్దేవా చేశారు. 20 లక్షల ఉద్యోగాలు, రూ. 3 వేల నిరుద్యోగ భృతి అన్నారు. ఇప్పుడు హామీలపై అడిగితే సమాధానం లేదు.రెండు బడ్జెట్‌లలోనూ నిధులు కేటాయించలేదన్నారు. 9 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని అబద్ధాలు చెబుతున్నారు. గవర్నర్ స్పీచ్‌లో అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు.
2024-25 సోషియో ఎకనామిక్ సర్వేలో ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో 27 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని అబద్ధాలు చెప్పారు. బడ్జెట్‌లో ప్రతిపాదించకుండా లక్షల ఉద్యోగాలు ఎలా ఇచ్చారని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు చేసేదంతా మోసం.. దగా.. వంచన అన్నారు. ప్రతి నిరుద్యోగికి ఇప్పటికే రూ. 72 వేలు ఎగమానం పెట్టార. మా హయాంలో 40 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించకపోగా.. పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. కడప రాకుండా జిందాల్‌ను బెదిరించి పంపించేశారు. అరబిందోను బెదిరించి పంపే కార్యక్రమం చేస్తున్నారు.
18-60 ఏళ్లలోపు ప్రతి మహిళలకు ఆర్థిక సాయం అన్నారు. ప్రతి మహిళకు చంద్రబాబు రూ. 36 వేలు బాకీపడ్డారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని ఎగమానం పెట్టారు. ఉచిత బస్సు రూపేణ రూ. 7 వేల కోట్లు ఎగరగొట్టారని ధ్వజమెత్తారు. ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15 వేలు ఇస్తామన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తామని చెప్పారు. తల్లికి వందనం పథకం కింద రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.