Telugu Global
Andhra Pradesh

దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పు

వైసీపీ అధినేతను ఉద్దేశించి ఏపీ శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు

దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పు
X

ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలతో మాజీ సీఎం జగన్‌ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఏపీ శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అన్నారు. బుధవారం సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష హోదాపై వైసీపీ ఎమ్మెల్యే జగన్‌ హైకోర్టుకు కూడా వెళ్లారు. న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చేవరకు వేచి చూద్దామనుకున్నా. ఇటీవల జగన్‌, వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఎంతటివారిపైనైనా అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో జగన్‌ వ్యవహరిస్తున్నారు. అప్పుడు ప్రచారానికి తెరదించడానికి రూలింగ్‌ ఇవ్వాలని నిర్ణయించాను. వారు చేస్తున్న ఆరోపణలు గందరగోళానికి దారి తీస్తున్నాయి. స్పీకర్‌కు దురుద్దేశాలు ఆపాదించడం సభా నియమాల ఉల్లంఘన కిందికి వస్తాయి. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పు అని అయ్యన్న వ్యాఖ్యానించారు.

First Published:  5 March 2025 10:49 AM IST
Next Story