టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన ఎమ్మెల్యే కొలికపూడి
కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారశైలిపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఆయన నుంచి పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్, మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ వివరణ తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి ఉంచి కొలికపూడి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఆయన వ్యవహారశైలిపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాజాగా ఈ నెల 111న ఎ. కొండూరు మండలంలో గోపాలపురంలో ఎమ్మెల్యే వ్యవహారశైలితో మనస్తాపం చెంది ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనను సీఎం తీవ్రంగా పరిగణిస్తున్నారు. తీరు మార్చుకోవాలని గతంలోనే కొలికపూడికి సూచించినా.. ఆయనలో మార్పు రాకపోవడంతో మరోసారి క్రమశిక్షణ కమిటీ ముందు పిలిచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. దీంతో క్రమశిక్షణ కమిటీ ఎదుట కొలికపూడి హాజరయ్యారు.