Telugu Global
Andhra Pradesh

‘సంపన్న ఆంధ్రప్రదేశ్’ పేరుతో కొత్త డ్రామానా..?

ఇప్పుడు మళ్ళీ సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరుతో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళని ప్రకటించుకోవటమే చాలా విచిత్రంగా ఉంది.

‘సంపన్న ఆంధ్రప్రదేశ్’ పేరుతో కొత్త డ్రామానా..?
X

స్వర్ణాంధ్రప్రదేశ్ అయిపోయింది, సన్ రైజింగ్ స్టేట్ కూడా అయిపోయింది. కొత్తగా సంపన్న ఆంధ్రప్రదేశ్ రాబోతోంది. ఏమిటిదంతా అనుకుంటున్నారా..? రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ+జనసేన కూటమి గెలిచేందుకు కొత్తగా రాష్ట్రాన్ని సంపన్న ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలని డిసైడ్ అయింది. రెండుపార్టీల నేతలు సోమవారం మినీ మేనిఫెస్టో రూపకల్పనపై సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో 11 అంశాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. టీడీపీ ఇప్పటికే ప్రతిపాదించిన 6 హామీలు, జనసేన ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్న ఐదు హామీలు ఇందులో ఉన్నాయి.

ఇవికాకుండా సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్రాభివృద్ధికి పెద్దపీట వేసేలా ప్రణాళికలు రచించినట్లు యనమల రామకృష్ణుడు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ల‌లాగ ఉమ్మడి మేనిఫెస్టో రెడీ చేస్తున్నట్లు చెప్పారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నారు. ఆ తర్వాత సన్ రైజింగ్ స్టేట్ అని కొంతకాలం ఊదరగొట్టారు. తర్వాత రెండూ నినాదాలు ఏమ‌య్యాయో ఏమో మళ్ళీ ఎక్కడా వాటిని ప్రస్తావించలేదు. ఐదేళ్ళ అధికారంలో ఇటు సంక్షేమమూ లేదు.. అటు అభివృద్ధి లేదు.

దాంతో జనాలు 2019 ఎన్నికల్లో ఘోరంగా టీడీపీ ఓడగొట్టారు. జనాల దెబ్బకు చంద్రబాబుకు, టీడీపీ నేత‌ల‌కు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో సంపన్న ఆంధ్రప్రదేశ్ అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టింది. అసలు సంక్షేమానికి చంద్రబాబుకు ఉప్పు నిప్పని అందరికీ తెలిసిందే. చంద్రబాబు హయాంలో యూజర్ ఛార్జీలు, సర్వీసు ఛార్జీలు మొద‌ల‌య్యాయి. జనాలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదన్నది చంద్రబాబు ఆలోచన. అయితే ఎన్నికల్లో గెలుపుకోసం మాత్రమే ఉచితాల పేరుతో హామీలిస్తారు. అధికారంలోకి వచ్చాక హామీల అమలును తుంగలో తొక్కేస్తారు.

2014 ఎన్నికల్లో గెలుపు కోసం ఇచ్చిన హామీలు, వాటి అమలును చూస్తే చాలు అర్థ‌మైపోతుంది చంద్రబాబు ఆలోచనలన్నీ. అలాంటిది ఇప్పుడు మళ్ళీ సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరుతో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళని ప్రకటించుకోవటమే చాలా విచిత్రంగా ఉంది. ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో చాలా సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించారు. ఇందులో కొన్నింటిని 2014లో కూడా ప్రకటించారు. ఇంకెన్ని ఉచితాలను ప్రకటిస్తారో తెలీదు. రాబోయేదే చంద్రబాబుకు లాజికల్ గా చివరి ఎన్నికలు. మరి జనాలు చంద్రబాబును ఎంతవరకు నమ్ముతారో చూడాలి.

First Published:  14 Nov 2023 9:54 AM IST
Next Story