Telugu Global
Andhra Pradesh

జగన్ ఒక్కరే అప్పులు చేశారా..? చంద్రబాబు చేయలేదా..? పవన్‌పై సెటైర్లు

వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ కు అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు కనిపించలేదా..? అని పలువురు నెటిజన్లు ప‌వ‌న్‌ను ప్రశ్నించారు.

జగన్ ఒక్కరే అప్పులు చేశారా..? చంద్రబాబు చేయలేదా..? పవన్‌పై సెటైర్లు
X

ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయం. అందుకే వీలున్నప్పుడు ఆంధ్రకు వచ్చి రాజకీయాలు చేస్తూ ఉంటారు. అయితే సమయం సరిపోనప్పుడు ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తుంటారు. తాజాగా పవన్ క‌ల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. 'అప్పులతో ఆంధ్ర పేరు మార్మోగిస్తున్నందుకు, ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు.. కీప్ ఇట్ అప్.. అంటూ పవన్ ట్వీట్ చేశారు.

అలాగే ముఖ్యమంత్రి జగన్ ను అప్పురత్న.. అని సంబోధిస్తూ సెటైర్ వేశారు. అయితే సీఎం జగన్ పై పవన్ కల్యాణ్ వేసిన సెటైర్లపై వైసీపీ శ్రేణులు కూడా తీవ్రస్థాయిలో స్పందిస్తున్నాయి. పవన్ కు కౌంటర్ వేస్తూ పలువురు నెటిజన్లు పవన్ ట్వీట్ కు బదులిచ్చారు.


దత్త తండ్రి చేసిన అప్పులు కనిపించలేదా?

వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ కు అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు కనిపించలేదా..? అని పలువురు నెటిజన్లు ప‌వ‌న్‌ను ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పుల గురించి కొందరు నెటిజన్లు లెక్కలతో సహా వివరించారు. దేశంలో ఏపీ అప్పుల్లో టాప్ లో ఏమీ లేదని, తమ తమ అవసరాల కోసం మిగతా రాష్ట్రాలు చేస్తున్న అప్పుల గురించి టేబుళ్ల రూపంలో వివరించారు. ఏ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు అప్పులు ఉన్నాయో సవివరంగా తెలియచెప్పారు.

సంక్షేమానికి జగన్ పెద్దపీట

టీడీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించి పెద్దగా పట్టించుకోలేదని, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పలువురు నెటిజన్లు పవన్ కు రిప్ల‌య్ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో కూడా భారీగా అప్పులు చేశారని, అయితే అప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడమే గాక అభివృద్ధి పనులు కూడా జరగలేదని మండిపడ్డారు.

జగన్ ప్రభుత్వం అప్పు తీసుకొచ్చిన ప్రతి రూపాయి అర్హులైన పేదవాళ్ల ఆకలి తీర్చడానికి ఉపయోగపడుతోందని, కళ్ళ ముందే లెక్కలు కనబడుతున్నాయని చెప్పారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వం తెచ్చిన అప్పుల లెక్కలు ఇవ్వడం లేదని పార్లమెంట్ లో కూడా చెప్పారని, పవన్ కు ఇవేవి గుర్తులేవా..? అని నెటిజన్లు ప్రశ్నించారు.

First Published:  7 Feb 2023 8:56 PM IST
Next Story