Telugu Global
Andhra Pradesh

రివ‌ర్స్ కొడుతున్న ప‌వ‌న్ కామెంట్స్‌.. సోషల్ మీడియాలో పంచ్‌లే పంచ్‌లు

మొదట పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు.. తర్వాత పార్టీ సింబల్ గాజు గ్లాసు పోయింది.. ఇప్పుడు అన్నవరం దేవాలయంలో చెప్పులు పోయాయి.. వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడు ఇప్పుడిస్తున్న ప్యాకేజీ కూడా పోతుందేమో అని పవన్ భోరున ఏడుస్తున్నట్లుగా మీమ్స్ వేశారు.

రివ‌ర్స్ కొడుతున్న ప‌వ‌న్ కామెంట్స్‌..    సోషల్ మీడియాలో పంచ్‌లే పంచ్‌లు
X

వారాహి యాత్రలో భాగంగా పిఠాపురంలో శుక్రవారం రాత్రి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన చెప్పుల కథ‌ రివర్స్‌ కొడుతోంది. వారాహి యాత్రకు ముందు అన్నవరంలో పూజలు చేయించుకుని దేవాలయం బయటకు వచ్చి చూస్తే తన రెండు చెప్పులను ఎవరో కొట్టేశారని పవన్ చెప్పారు. అక్కడితో ఆగితే సరిపోయేది. ఆగితే పవన్ ఎందుకవుతారు? తన చెప్పులను ఎవరైనా చూస్తే చెప్పండని చెప్పి వైసీపీ ప్రభుత్వమే తన చెప్పులను కొట్టేసిందని నవ్వుతు చెప్పారు. అంటే పవన్ ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన చెప్పులను కూడా దొంగతనం చేసిందని చులకన చేయటమే.

అయితే శనివారం ఉదయానికి పవన్ చెప్పిన చెప్పుల కథ‌ రివర్స్‌ కొట్టింది. వైసీపీ నేతలతో పాటు నెటిజన్లు పవన్ మీద విపరీతంగా పంచ్‌లు వేస్తున్నారు. మాజీ మంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. చెప్పులు పోతే మళ్ళీ ఇంకో కొత్త జత కొనుక్కోవచ్చు లేదా ఎవరో ఒక ప్రొడ్యూసర్ కొనిస్తాడన్నారు. దానికి అంతగా కంగారుపడాల్సిన అవసరంలేదన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ రద్దు చేసిన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసు సంగతి చూసుకోమని సెటైర్ వేశారు. ఇక నెటిజన్లయితే ఫుల్లుగా ఆడుకున్నారు.

మొదట పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు.. తర్వాత పార్టీ సింబల్ గాజు గ్లాసు పోయింది.. ఇప్పుడు అన్నవరం దేవాలయంలో చెప్పులు పోయాయి.. వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడు ఇప్పుడిస్తున్న ప్యాకేజీ కూడా పోతుందేమో అని పవన్ భోరున ఏడుస్తున్నట్లుగా మీమ్స్ వేశారు. ఆదిపురుష్ సినిమా ఆడుతున్న థియేటర్లలో ఒక సీటును హనుమంతుడికి రిజర్వ్ చేశారనే వార్త అందరికీ తెలిసిందే.

ఇది ఫక్తు సినిమా యూనిట్ సెంటిమెంట్‌ను రాజేసే ప్రయత్నాలని తెలిసిపోతోంది. అదే పద్ధ‌తిలో బ్రహ్మానందం డైలాగ్ చెప్పినట్లుగా ‘పదండి సినిమా థియేటర్లలో హనుమంతుడికి ఒక సీటు వదిలేసినట్లే అసెంబ్లీలో మనవాడికి(పవన్‌కు) ఒక సీటును వదిలేయమని గట్టిగా అడుగుదాం’ అన్న మీమ్ సోషల్ మీడియా వైరల్ అవుతోంది. జగన్ మీద సెటైర్లు వేసి జనాల్లో చులకన చేద్దామని పవన్ చేసిన ప్రయత్నం దారుణంగా రివర్స్‌ కొడుతోంది. ఆలయంలో చెప్పులు పోవటానికి వైసీపీ ప్రభుత్వానికి ఏమి సంబంధం? ముందు వెనకా ఆలోచించకుండా మాట్లాడితే సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆటాడుకుంటారన్న విషయం పవన్ మరచిపోయినట్లున్నారు.

First Published:  18 Jun 2023 11:39 AM IST
Next Story