పవన్‌పై నెటిజన్లు ఫుల్లు ఫైర్
పవన్ కల్యాణ్ తాజా ట్వీట్‌పై నెటిజన్లలో ఎక్కువ మంది నెగిటివ్‌గానే రెస్పాండ్ అవుతున్నారు. రాజకీయంగా ఇంత కన్ఫ్యూజన్‌లో ఉన్న పవన్‌కు ఎందుకు ఓట్లేయాలని కొందరు నిలదీస్తే.. మరికొందరు తాము కూడా కాపులమే కానీ పవన్‌కు మాత్రం ఓట్లేసేదిలేదని స్పష్టంగా చెప్పేశారు.
* నాకు అండగా నిలబడండి.. అందరి అండతో అధికారం సాధిద్దాం..
* అందరూ నన్ము కాపు నాయకుడంటారు.. కానీ కాపులు నన్ను తమ నాయకుడిగా గుర్తించటం లేదు.
* కాపులు ఓట్లేయకపోతే ఎలా గెలుస్తాం?
* జనసేన గెలిస్తే కాపులు గెలిచినట్లే..
* కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి..
* కాపులు లేకుండా దక్షిణ భారతదేశంలో రాజకీయాలుండవు... ఇవి ట్విట్టర్లో పవన్ చేసిన తాజా ట్వీట్లు. దీని మీద నెటిజన్లు ఫుల్లుగా ఫైర్ అవుతున్నారు. రెడ్లంతా తనకు అండగా నిలబడాలని, ఓట్లేయాలని, గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ అడగలేదు. అలాగే కమ్మోరంతా ఓట్లేసి తనను గెలిపించాలని చంద్రబాబు నాయుడు కూడా అడగలేదు.
మరి కాపులంతా ఓట్లేయాలని, జనసేన గెలిస్తే కాపులు గెలిచినట్లేనని, కాపులు తనను నాయకుడిగా గుర్తించటంలేదని పవన్ చెప్పటం ఏమిటని నిలదీస్తున్నారు. కొందరైతే పవన్ ట్వీట్లకు చాలా అసభ్యంగా స్పందించారు. విచిత్రం ఏమిటంటే ఒకవైపు కాపులు తనను నాయకుడిగా గుర్తించటంలేదని చెప్పుకుంటూనే మరోవైపు తనకు కాపులు ఓట్లేయకపోతే ఎలా గెలుస్తానని మళ్ళీ కాపులనే అడగటం. జనసేన గెలిస్తే కాపులు గెలిచినట్లు ఎలాగ అవుతుందో పవనే చెప్పాలి. అసలు ఏ పార్టీకైనా ఒక కులం ఓట్లు పడితే సరిపోతుందా? అన్నది చిన్న లాజిక్. ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే అన్నీ కులాల్లోని మెజారిటి జనాలు ఓట్లేస్తేనే అధికారంలోకి వస్తుంది.
ఒకవైపు పవన్ కాపులు, కాపులు అని జపం చేస్తుంటే మరోవైపు మిగిలిన సామాజిక వర్గాలు పవన్‌కు ఎందుకు ఓట్లేయాలని ఆలోచిస్తే ఆ తప్పు మిగిలిన సామాజికవర్గాలది కానేకాదు. ఇంత పబ్లిగ్గా తాను కాపు కాబట్టి కాపులంతా జనసేనకు ఓట్లేయాలని పవన్ అడిగినట్లు అడగటం రాష్ట్ర చరిత్రలో బహుశా ఇదే మొదటిసారేమో. చాలామంది నెటిజన్లు రెస్పాండ్ అవుతూ తాము కూడా కాపులమే కానీ పవన్‌కు మాత్రం ఓట్లేసేదిలేదని స్పష్టంగా చెప్పేశారు. రాజకీయంగా ఇంత కన్ఫ్యూజన్‌లో ఉన్న పవన్‌కు ఎందుకు ఓట్లేయాలని మరికొందరు నిలదీశారు. మొత్తానికి పవన్ తాజా ట్వీట్‌పై నెటిజన్లలో ఎక్కువ మంది నెగిటివ్‌గానే రెస్పాండ్ అవుతున్నారు.