Telugu Global
Andhra Pradesh

అచ్చెన్నతో చేయించొచ్చు కదా పాదయాత్ర.. - నెటిజన్ల విమర్శలు

లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లోనే చాలా తడబడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లోకేశ్ ను ప్రజల్లోకి పంపించకుండా.. ఓ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించకుండా.. నేరుగా ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెట్టారు.

అచ్చెన్నతో చేయించొచ్చు కదా పాదయాత్ర.. - నెటిజన్ల విమర్శలు
X

త్వరలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాదయాత్ర చేయబోతున్నారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం నుంచి ఇచ్ఛాపురం వరకు ఆయన పాదయాత్ర కొనసాగబోతున్నది. 400 రోజులపాటు 4వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారని.. ముఖ్యంగా యువత అభిప్రాయాలను లోకేశ్ తెలుసుకుంటారని టీడీపీ నేతలు చెబుతున్నారు. కాగా, లోకేశ్ పాదయాత్ర విషయంలో నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. బీసీలకు పెద్ద పీట వేస్తాం అని చెప్పుకొనే తెలుగుదేశం పార్టీ.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాదయాత్ర చేయించొచ్చు కదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. లోకేశ్ తో పోల్చుకుంటే అచ్చెన్నాయుడు బాగా మాట్లాడతారని.. ఆయనకు మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.

లోకేశే ఎందుకు?

లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లోనే చాలా తడబడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లోకేశ్ ను ప్రజల్లోకి పంపించకుండా.. ఓ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించకుండా.. నేరుగా ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెట్టారు. దీనిపై అనేక విమర్శలు వచ్చినా లెక్కచేయలేదు. అయితే లోకేశ్ ను ముందుగా జనంలోకి పంపించాల్సి ఉండేదని.. ఆ పార్టీలోని వారే వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలా ఉంటే.. పెద్దగా ప్రజలతో సంబంధాలు లేని లోకేశ్ కు రాజకీయ ప్రసంగాలు కూడా కొత్తే. దీంతో ఆయన అనేక సార్లు తడబడేవారు. ఆయన మాటలు వింటుంటే తెలుగుదేశం కార్యకర్తలకే విసుగొచ్చేది. ఓ దశలో లోకేశ్ ను కేవలం ట్విట్టర్ కే పరిమితం చేశారు. ఆయన కేవలం ట్వీట్లకే పరిమితమయ్యారు. అయితే గత కొంతకాలంగా లోకేశ్ ను జనంలోకి పంపిస్తున్నారు.

తాజాగా ఆయన పాదయాత్ర చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం తెలుగుదేశం పార్టీకి రాజకీయ సలహాలు ఇస్తున్న రాబిన్ శర్మ టీమ్ తీవ్రంగా శ్రమించినట్టు సమాచారం. లోకేశ్ పాదయాత్ర ఎలా సాగాలి..? ఆయన ఏం మాట్లాడాలి..? తదితర విషయాలపై ముందే ట్రైనింగ్ ఇచ్చి రంగంలోకి దింపబోతున్నారట. మరి లోకేశ్ పాదయాత్రలో అయినా సక్సెస్ అవుతారో లేదో చూడాలి.

First Published:  28 Dec 2022 2:30 PM IST
Next Story