Telugu Global
Andhra Pradesh

సజ్జల.. ఇలాగే చేస్తే.. నీకు వీడియో కాల్స్ వస్తాయి.. జాగ్రత్త

సజ్జల రామకృష్ణారెడ్డి.. మరోసారి ఇలాంటి వ్యక్తులతో ఫోన్లు చేయిస్తే నెల్లూరు రూరల్ నుంచి నేరుగా మీకు వీడియో కాల్సే వస్తాయి అని కోటంరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఆ విషయం గుర్తు పెట్టుకో అని హెచ్చ‌రించారు.

సజ్జల.. ఇలాగే చేస్తే.. నీకు వీడియో కాల్స్ వస్తాయి.. జాగ్రత్త
X

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈసారి నేరుగా ప్ర‌భుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి మనుషులు తనకు ఫోన్లు చేసి బూతులు తిడుతున్నారని కోటంరెడ్డి వివరించారు. వారిలో బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి నిన్న ఫోన్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడితే ఎడ్ల బండికి కట్టుకుని నెల్లూరు రూరల్ నుంచి కొట్టుకుంటూ ఈడ్చుకెళ్తానని బూతులు తిట్టారన్నారు. బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి పలువురు నాయకులకు ఫోన్లు చేసి ఇలాగే తిడుతుంటారని.. ఈయన ఎవరు అని ఆరా తీస్తే సజ్జల రామకృష్ణారెడ్డి కోటరి వ్యక్తి అని తేలిందన్నారు.

తనకు 100 కాల్స్‌ వస్తే అందులో 70 ఫోన్లు తనను అభినందిస్తూ వస్తున్నాయని.. మరో 20 కాల్స్ మీరు వైసీపీలోనే ఉంటే బాగుండూ అంటూ వస్తున్నాయన్నారు. మిగిలిన 10 శాతం కాల్స్ మాత్రం బూతులు తిడుతూ వస్తున్నాయన్నారు. అందులో బోరగడ్డ అనిల్ ఒకరన్నారు. బండికి కట్టుకుని ఈడ్చుకెళ్తానంటున్న బోరగడ్డ అనిల్ ఆ పని చేయాలని సవాల్ చేశారు. ఇలాంటి ఐదారుగురు వ్యక్తులు సజ్జల వద్ద ఉన్నారన్నారు. ఎవరైనా ఎదురు మాట్లాడితే వీరితో ఫోన్లు చేయించి తిట్టుస్తుంటారని చెప్పారు.

సజ్జల రామకృష్ణారెడ్డి.. మరోసారి ఇలాంటి వ్యక్తులతో ఫోన్లు చేయిస్తే నెల్లూరు రూరల్ నుంచి నేరుగా మీకు వీడియో కాల్సే వస్తాయి అని కోటంరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఆ విషయం గుర్తు పెట్టుకో అని హెచ్చ‌రించారు.

అన్ని పనులూ వదిలేసి ఆపరేషన్ నెల్లూరు రూరల్‌ మీదే సజ్జల ఉన్నారన్నారు. కొట్టుకుంటూ తీసుకెళ్తా అని చెప్పిన బోరగడ్డ అనిల్‌కు నిన్ననే తీసుకెళ్లు అని చెప్పానని.. మరోసారి మాట్లాడితే తీసుకెళ్తా అన్నారని.. అందుకే సజ్జల గురించి మరోసారి మాట్లాడుతున్నానని.. ఇప్పుడు వచ్చి కొట్టుకుంటూ తీసుకెళ్లాలని సవాల్ చేశారు. విభేదించినంత మాత్రాన అధికారం మీ చేతుల్లో ఉందని ఇష్టానుసారం వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. వైసీపీ నిజమైన సోషల్ మీడియా సైనికులు ఇప్పుడు లేరని.. వారంతా ఎప్పుడో వెళ్లిపోయారని.. ప్రస్తుతం సజ్జల భార్గవ్ ఆధ్వర్యంలో ఒక టీం నడుస్తోందని.. వారందరినీ తన మీదకు మళ్లించారని కోటంరెడ్డి చెప్పారు.

First Published:  4 Feb 2023 11:20 AM IST
Next Story