Telugu Global
Andhra Pradesh

అసెంబ్లీలో జగన్ కి తలనొప్పిగా మారిన కోటంరెడ్డి

అసెంబ్లీలో తనకు మైక్ ఇస్తే సరేసరి, లేకపోతే ప్లకార్డ్ పట్టుకుని అసెంబ్లీ జరిగినంతసేపు నిలబడే ఉంటానన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. నెల్లూరు రూరల్ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇస్తేనే తన నిరసన విరమిస్తానన్నారు.

అసెంబ్లీలో జగన్ కి తలనొప్పిగా మారిన కోటంరెడ్డి
X

ఏపీ అసెంబ్లీ తొలిరోజు సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ బాయ్ కాట్ చేసి వెళ్లిపోయింది. చంద్రబాబు హాజరుకాకపోవడంతో టీడీపీ తరపున పెద్దగా ప్రతిస్పందన ఉండే అవకాశమే లేదు. ప్రతిపక్షం డల్ గా ఉన్న అసెంబ్లీలో ఇప్పుడు వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కోటంరెడ్డి, సీఎం జగన్ కి తలనొప్పిగా మారారు. రెండోరోజునుంచే ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలతో రెడీ అయ్యారు.

నెల్లూరు రూరల్ సమస్యలపై కోటంరెడ్డి 'పోరుబాట' మొదలు పెట్టారు. నిన్నటి వరకు నెల్లూరులోనే ఆయన పోరాటం కొనసాగేది, ఇప్పుడది అమరావతికి చేరింది. వెలగపూడి గ్రామం నుంచి అసెంబ్లీకి ఆయన పాదయాత్ర చేపట్టారు. ప్లకార్డ్ చేతబట్టుకుని పాదయాత్ర చేస్తూ అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడిన ఆయన సమస్యలు పరిష్కారమయ్యే వరకు తన పోరాటం ఆగబోదన్నారు.


తిరిగి తిరిగి విసిగిపోయా..

నెల్లూరు రూరల్ సమస్యలపై తాను అధికారులు, మంత్రులు, స్వయానా ముఖ్యమంత్రి చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయానని అన్నారు. సమస్యలపై నిలదీస్తే తనను దూరం పెట్టారని, నిఘా పెట్టి ఇబ్బందులకు గురిచేశారని వాపోయారు. తన నియోజకవర్గం సమస్యలు పరిష్కారమయ్యే వరకు తన పోరాటం ఆగదన్నారు. అసెంబ్లీలో తనకు మైక్ ఇస్తే సరేసరి లేకపోతే ప్లకార్డ్ పట్టుకుని అసెంబ్లీ జరిగినంతసేపు నిలబడే ఉంటానన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. నెల్లూరు రూరల్ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇస్తేనే తన నిరసన విరమిస్తానన్నారు.

First Published:  15 March 2023 4:14 AM GMT
Next Story