అరేయ్, ఒరేయ్, హాఫ్ నాలెడ్జ్ గా..! మళ్లీ మొదలెట్టిన అనిల్
లోకేష్ కి తెలుగు మాట్లాడటం సరిగా రాదని, ముందు ఆయన మంగళగిరిలో గెలిచేందుకు ప్రయత్నించాలని చెప్పారు. రాష్ట్రం మొత్తం తిరిగినా చివరకు మంగళగిరిలో లోకేష్ ఓడిపోతారని ఎద్దేవా చేశారు అనిల్.
నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ పై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ తీవ్రంగా మండిపడ్డారు. తన హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. టైమ్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే అంటూ సినిమా స్టైల్ లో సవాల్ విసిరారు అనిల్. హాఫ్ నాలెడ్జ్ తో తనపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అసలు లోకేష్ కి తెలుగు మాట్లాడటం సరిగా రాదని, ముందు ఆయన మంగళగిరిలో గెలిచేందుకు ప్రయత్నించాలని చెప్పారు. రాష్ట్రం మొత్తం తిరిగినా చివరకు మంగళగిరిలో లోకేష్ ఓడిపోతారని ఎద్దేవా చేశారు అనిల్.
మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ ఇటీవల కొంతకాలంగా అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనడంలేదు. గడప గడపపై సీఎం జగన్ పెట్టిన రివ్యూ మీటింగ్ కి కూడా ఆయన హాజరు కాలేదు. ఆయనకు ఇంటిపోరు కూడా బాగా ఎక్కువైందనే వార్తలు వినపడుతున్నాయి. ఇటీవల అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం పెట్టిన అనిల్, స్వపక్షంలో విపక్షంలా ఉన్న నేతలకు ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. అనిల్ అంటే ఏంటో చూపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు నారా లోకేష్ పై మండిపడుతూ ప్రెస్ మీట్ పెట్టారు అనిల్.
సిగ్గు, శరం ఉంటే రాజీనామా చెయ్..
నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని విడిచి బయటకు వెెళ్లలేదని, తామే ఆ ముగ్గుర్ని స్క్రాప్ కింద జమ చేసి బయటకు విసిరేశామని అన్నారు అనిల్. ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారంటే అది జగన్ పెట్టిన భిక్ష అన్నారు. ఆనంకు సిగ్గు, శరం ఉంటే వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలన్నారు.
పాదయాత్ర అంటే..?
అసలు పాదయాత్ర అంటే జగన్ లాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేయాలని, లోకేష్ ఉదయం నుంచి సాయంత్రం వరకు రెస్ట్ తీసుకుని, సాయంత్రం కాసేపు ఈవెనింగ్ వాక్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు అనిల్. అసలది పాదయాత్రే కాదన్నారు. ఎవరెన్ని యాత్రలు చేసినా వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనన్నారు.