కొత్త సీఎస్‌గా చంద్రబాబుకు నమ్మకస్తుడు..
ఎన్నికల టైమ్‌లో ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన కూటమి.. ఇప్పుడాయన్ను పక్కకు తప్పించింది. ఆయన్ను సెలవుపై వెళ్లాల్సిందిగా సాధారణ పరిపాలనశాఖ ఆదేశించింది.

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. అలాగే ప్రస్తుత సీఎస్ జవహర్‌రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 1987 బ్యాచ్‌కి చెందిన నీరభ్ కుమార్ గతంలో చంద్రబాబు హయాంలో కీలక శాఖలకు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు.
ఎన్నికల టైమ్‌లో ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన కూటమి.. ఇప్పుడాయన్ను పక్కకు తప్పించింది. ఆయన్ను సెలవుపై వెళ్లాల్సిందిగా సాధారణ పరిపాలనశాఖ ఆదేశించింది. దీంతో సీఎస్ జవహర్ రెడ్డి సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఈ నెలాఖరుకు ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉన్నా కూడా హడావిడిగా ఆయన్ను పక్కకు తప్పించారు. తాజాగా టీడీపీకి అనుకూలమైన నీరభ్‌కుమార్‌ను సీఎస్‌గా నియమించుకున్నారు.