Telugu Global
Andhra Pradesh

ఫేక్ న్యూస్ తో పరువు పోగొట్టుకున్న నారా లోకేష్

టీడీపీ సానుభూతిపరులంతా సోషల్ మీడియాలో ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో విశాఖ పోలీసులు అసలు విషయం బయటపెట్టారు.

ఫేక్ న్యూస్ తో పరువు పోగొట్టుకున్న నారా లోకేష్
X

ఏపీలో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరుగుతున్న గొడవలతో సోషల్ మీడియా అట్టుడికిపోతోంది. అయితే ఇందులో చాలా వార్తలు ఫేక్ అని తేలడం విశేషం. తాజాగా నారా లోకేష్ కూడా ఇలాంటి ఓ ఫేక్ పోస్ట్ తో తన పరువు తానే తీసుకున్నారు. వ్యక్తిగత గొడవలకు రాజకీయ రంగు పులమాలనుకున్నారు లోకేష్. చివరకు పోలీసులు ఆ ఫేక్ పోస్ట్ వ్యవహారాన్ని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారు. దీనిపై లోకేష్ రియాక్షన్ ఏంటో చూడాలి.


అసలేం జరిగింది..?

ఎన్నికల రోజు విశాఖపట్నంలోని అక్కిరెడ్డిపాలెంలో ఓ గొడవ జరిగింది. వైసీపీకి ఓటు వేయలేదని, ఓ కుటుంబంపై దాడి చేశారని, వాళ్లను గాయపరిచారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. బాధితులు కూడా తమపై పొలిటికల్ అటాక్ జరిగిందని ఆరోపించారు. దీంతో నారా లోకేష్ కూడా ఇది పొలిటికల్ దాడి అని తీర్మానించేశారు. తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో వైసీపీని విమర్శిస్తూ పోస్టింగ్ పెట్టారు. ప్రజాస్వామ్యంపై వైసీపీ నేతలు దాడి చేశారని మండిపడ్డారు. అమానవీయ ఘటన, అనాగరిక చర్య అంటూ దుమ్మెత్తిపోశారు.

సీన్ రివర్స్..

టీడీపీ సానుభూతిపరులంతా సోషల్ మీడియాలో ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో విశాఖ పోలీసులు అసలు విషయం బయటపెట్టారు. అది అసలు పొలిటికల్ దాడి కాదని వివరణ ఇచ్చారు. కేవలం వ్యక్తిగత తగాదాల వల్ల ఇరుగు పొరుగు వారు ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారని చెప్పారు. పాత గొడవలు ఉన్నాయని, ఈ గొడవలకు రాజకీయాలకు, ఎలక్షన్ కి సంబంధం లేదన్నారు. సోషల్ మీడియాలోని ఫేక్ పోస్ట్ లను నమ్మొద్దని అన్నారు. దీంతో వైసీపీ సోషల్ మీడియా విభాగం.. ఈ వివరణను హైలైట్ చేసింది. లోకేష్ సిగ్గుతో తలదించుకోవాలని ఘాటు గా ఓ పోస్ట్ చేసింది. ఓ పోస్టింగ్ ఇప్పుడు వైరల్ గా మారింది.

First Published:  17 May 2024 12:38 PM IST
Next Story