చంద్రబాబు ఇంటికి.. లోకేష్ ఢిల్లీకి
ఉండవల్లిలోని ఇంటికి చేరుకోగానే భార్య భువనేశ్వరి ఆయనకు దిష్టితీసి స్వాగతం పలికారు. చంద్రబాబు, కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు కంటతడి పెట్టారు. కుటుంబ సభ్యుల్ని ఆలింగనం చేసుకున్నారు.
చంద్రబాబు జైలు నుంచి ఇంటికి చేరుకున్న రోజే.. ఆయన తనయుడు ఢిల్లీ బాట పట్టడం విశేషం. తండ్రి కేసుల విచారణ సందర్భంలో ఢిల్లీలో న్యాయవాదులతో సంప్రదించడం కోసమే లోకేష్ ఢిల్లీ వెళ్లారని చెబుతున్నారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఇటు వరుసగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లి న్యాయనిపుణులతో లోకేష్ చర్చలు జరుపుతారని సమాచారం. కేసుల విషయంలో న్యాయపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లోకేష్ వారితో మాట్లాడతారని అంటున్నారు.
చంద్రబాబు ఇంట భావోద్వేగం..
రాజమండ్రి జైలు నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు ఊరేగింపుగా చేరుకున్నట్టయింది. ఆయన కాన్వాయ్ కి దారిపొడవునా అభిమానులు స్వాగతం పలికారు. ఉండవల్లిలోని ఇంటికి చేరుకోగానే భార్య భువనేశ్వరి ఆయనకు దిష్టితీసి స్వాగతం పలికారు. చంద్రబాబు, కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు కంటతడి పెట్టారు. కుటుంబ సభ్యుల్ని ఆయన ఆలింగనం చేసుకున్నారు.
వాట్ నెక్ట్స్..
చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చాక జైలు ముందే స్పీచ్ ఇచ్చారు. బెయిల్ కండిషన్లను ఆయన ఉల్లంఘించారని కొంతమంది అంటున్నారు. అటు అభిమానులు మాత్రం సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు ఎవరితో సమావేశం కాకూడదనే కండిషన్ కూడా ఉంది. జూమ్ లో కూడా ఆయన పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి ప్రసంగించకూడదు. జైలులో ఉండాల్సిన ఆయన బయటకొచ్చారన్న సంతోషం మాత్రం టీడీపీ శ్రేణుల్లో కనపడుతోంది. మధ్యంతర బెయిల్ పూర్తయ్యేలోగా.. అసలు బెయిల్ వచ్చేస్తుందనే ఆశాభావం టీడీపీ నేతల్లో కనపడుతోంది. అటు క్వాష్ పిటిషన్ కి సంబంధించి సుప్రీంలో విచారణ జరగాల్సి ఉంది.