వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య మధ్య గొడవ పెట్టాలని అధికార పార్టీ చూస్తోంది - నారా లోకేష్ సంచలన ట్వీట్
బాలయ్య, చిరు సినిమాల విడుదలని వాడుకుని ఫ్యాన్స్ వార్, క్యాస్ట్ వార్‌కి వైసీపీ సోషల్ మీడియా వేదికగా తెరతీసే అవకాశం ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
బాలయ్య వీరసింహారెడ్డి, మెగా స్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. ఇద్దరూ హీరోలకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగానూ, ప్రవాసులు వీర ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఇద్దరు హీరోల మధ్య బద్ధ వైరం ఉన్నా.. కులాలు కమ్మ-కాపు కావడం మరింత హీటెక్కిస్తోంది. వీరి మధ్య విభేదాలు సృష్టించి వైసీపీ లాభపడాలని చూస్తోందని టిడిపి, జనసేన ఆరోపిస్తున్నాయి. ఇటీవలే పవన్-బాబు భేటీ వైసీపీలో ప్రకంపనలు రేపింది. బాలయ్య, చిరు సినిమాల విడుదలని వాడుకుని ఫ్యాన్స్ వార్, క్యాస్ట్ వార్‌కి వైసీపీ సోషల్ మీడియా వేదికగా తెరతీసే అవకాశం ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
We must also note that evil elements from the ruling party are getting ready to instigate fan wars, pitching one community against another with fake SM accounts and provocative content. Humbly request all to report such accounts and avoid getting carried away.
— Lokesh Nara (@naralokesh) January 11, 2023
ఈ ట్వీట్ సారాంశం ఇలా..
``సంక్రాంతికి ప్రేక్షకులకు వినోదం పంచేందుకు వీరసింహారెడ్డిగా వస్తున్న బాల మావయ్య, వాల్తేరు వీరయ్యగా వస్తున్న చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలరించే పాటలు, ఆలోచింపజేసే మాటలు, ఉర్రూతలూగించే డ్యాన్సులతో పూర్తిస్థాయి వినోదం అందించే ఈ చిత్రాలను కోట్లాది ప్రేక్షకులలో ఒకడిగా నేనూ చూడాలని తహతహలాడుతున్నాను. హీరోల పేరుతో, కులాల పేరుతో ఫేక్ పోస్టులు సృష్టించి విధ్వేశాలు రెచ్చగొట్టేందుకు అధికార పార్టీ సన్నద్ధమైంది. ఇద్దరు అగ్రహీరోల సినిమాలు విడుదలవుతున్న సందర్భాన్ని వాడుకుని సోషల్ మీడియాలో ఫేక్ ఖాతాల ద్వారా ఒక కులం పేరుతో మరో కులంపై విషం చిమ్మాలని కుట్రలు పన్నారు. విష ప్రచారాలు చేసి కుల, మత, ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిల్చిన దుష్ట చరిత్ర గలిగినవారి ట్రాప్‌లో ఎవరూ పడొద్దు. సినిమాలు అంటే వినోదం. సినిమాలను వివాదాలకు వాడుకోవాలనే అధికార పార్టీ కుతంత్రాలను తిప్పికొడదాం. మనమంతా ఒక్కటే. కులం, మతం, ప్రాంతం ఏవీ మనల్ని విడదీయలేవు.``