తమ్ముళ్ల దెబ్బకు లోకేష్ రూటు మారిపోయిందా..?
ఇంతకుముందు ప్రకటించిన రూటుమ్యాప్ బదులు పార్టీ కొత్తగా మరో రూటుమ్యాపును నేతలకు అందించిందట. కొత్త రూటుమ్యాపు ప్రకారం పాయకరావుపేట నుంచి యలమంచిలి, అనకాపల్లి, పరవాడ, గాజువాక మీదుగా భీమిలీ చేరుకుంటోంది.
నారా లోకేష్‌కు తమ్ముళ్లు పెద్ద షాకిచ్చారట. వీళ్ల షాకును తట్టుకోలేకే చివరి నిమిషంలో లోకేష్ పాదయాత్ర రూటుమ్యాపును కూడా మార్చేసినట్లు పార్టీవర్గాల సమాచారం. ఇంతకీ విషయం ఏమిటంటే.. పాయకరావుపేట మీదుగా నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పరవాడ, గాజువాక మీదుగా భీమిలీలోకి యువగళం పాదయాత్ర ఎంటరవ్వాలి. భీమిలీలోనే 20 లేదా 21న బహిరంగసభ నిర్వహణతో పాదయాత్ర పూర్తవుతుంది.
అయితే ఇంతకుముందు ప్రకటించిన రూటుమ్యాప్ బదులు పార్టీ కొత్తగా మరో రూటుమ్యాపును నేతలకు అందించిందట. కొత్త రూటుమ్యాపు ప్రకారం పాయకరావుపేట నుంచి యలమంచిలి, అనకాపల్లి, పరవాడ, గాజువాక మీదుగా భీమిలీ చేరుకుంటోంది. ముందుగా అనుకున్నట్లు బహిరంగసభ తేదీని కూడా నాలుగు రోజులు వెనక్కునెట్టారు. రెండు రూట్లలో తేడా ఏమిటంటే నర్సీపట్నం, చోడవరం, మాడుగుల నియోజకవర్గాలను తప్పించేశారు. సడన్‌గా మూడు నియోజకవర్గాలను రూటుమ్యాపు నుంచి ఎందుకు తప్పించేసినట్లు..?
ఎందుకంటే.. చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో పాదయాత్రకు ఏర్పాట్లు చేయలేదట. కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు మీద అలిగి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు టాక్. నర్సీపట్నంలో ఎమ్మెల్యేగా తనకు అనకాపల్లి ఎంపీగా తన కొడుకు విజయ్‌కి టికెట్లు కావాలని చింతకాయల పట్టుబట్టారు. అయితే చంద్రబాబు మాత్రం ఎమ్మెల్యే టికెట్ ఓకే.. ఎంపీ టికెట్ నాట్ ఓకే.. అంటున్నారట. దాంతో చింతకాయలకు మండిపోయి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో గంటా శ్రీనివాస్‌కు చంద్రబాబు బాగా ప్రయారిటీ ఇవ్వటాన్ని కూడా చింతకాయల తట్టుకోలేకపోతున్నారు.
కొడుక్కి ఎంపీ టికెట్ పై హామీ ఇచ్చేంతవరకు చింతకాయల అలక వీడేట్లు లేరు. ఇక చోడవరం, మాడుగులలో పాదయాత్ర ఖర్చులను తాము భరించలేమని తమ్ముళ్ళు చేతులెత్తేశారట. ఖర్చులు మొత్తాన్ని పార్టీనే భరించుకునేట్లయితే ఏర్పాట్లు తాము చేస్తామని చెప్పేశారట. ఈ విషయమై పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతో తమ్ముళ్లు ఏర్పాట్లు చేయలేదట. అందుకనే పై మూడు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తే ఇబ్బందులు, అవమానాలు తప్పవని అర్థమై వాటిని షెడ్యూల్ నుంచి తొలగించినట్లు సమాచారం.