లోకేష్ పాదయాత్రే టీడీపీకి లాస్ట్ హోపా..?
రాష్ట్రంలో ప్రజలంతా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా..? ఎప్పుడెప్పుడు టీడీపీకి ఓట్లేద్దామా అని ఎదురు చూస్తున్నారన్నట్లుగా ఉన్నారని యనమల మాటల్లోని అర్థం.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటానికి నారా లోకేష్ మీదే అందరూ ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అంటే పార్టీకి లోకేష్ మాత్రమే ఆశాకిరణంగా భావిస్తున్నారు. తాజాగా సీనియర్ నేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడి మాటలు విన్నతర్వాత ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. లోకేష్ పాదయాత్రతో పార్టీ అధికారంలోకి వచ్చేయటం ఖాయమని ఆయన గంపడాశతో ఉన్నారు. యువగళం పాదయాత్ర మార్పునకు సంకేతంగా యనమల చెప్పారు.
రాష్ట్రంలో ప్రజలంతా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా..? ఎప్పుడెప్పుడు టీడీపీకి ఓట్లేద్దామా అని ఎదురు చూస్తున్నారన్నట్లుగా ఉన్నారని యనమల మాటల్లోని అర్థం. నిజానికి లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేయాలని అనుకోవటం మార్పునకు సంకేతంగా ఎలాగవుతుందో యమనలకే తెలియాలి. అధికారంలోకి రావటమే ఏకైక లక్ష్యంగా లోకేష్ పాదయాత్ర ప్లాన్. దానికి జనాలు స్పందించే తీరుమీద మిగిలిన విషయాలు ఆధారపడున్నాయి. పాదయాత్రలో కూడా మొత్తం టీడీపీ శ్రేణులే ఉండేట్లు చూసుకుంటున్నారు.
టీడీపీ శ్రేణులు పాల్గొనే పాదయాత్రంటే అదికూడా అమరావతి కోసం చేసిన పాదయాత్రగా మాత్రమే మిగిలిపోతుంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే రెండు వరుస ఘటనల్లో 11 మంది చనిపోవటంతో చంద్రబాబు నాయుడు జోరు తగ్గించినట్లున్నారు. అందుకనే పార్టీ యావత్తు లోకేష్ పాదయాత్రను సక్సెస్ చేయటంపై దృష్టిపెట్టింది. తండ్రి కార్యక్రమాల్లో 11 మంది చనిపోవటం కొడుకు పాదయాత్రపై ప్రభావం పడకుండానే ఉంటుందా..? ఎందుకంటే తండ్రికి అయినా కొడుక్కయినా నిర్వాహకులు ఒకళ్ళే కదా.
మొత్తంమీద లోకేష్ పాదయాత్ర బ్రహ్మాండమని చెప్పుకోవటానికి ప్రతి నియోజకవర్గంలోనూ పెద్దఎత్తున సీనియర్లు+యువ నేతలు పాల్గొనేట్లుగా చంద్రబాబు ప్లాన్ చేశారు. ఎలాగూ మీడియా వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి పాదయాత్ర బ్రహ్మాండమని మొదటిరోజు నుండి ఊదరగొట్టేయటం ఖాయం. మరి మామూలు జనాలు స్పందన ఏ విధంగా ఉండబోతోందన్నదే చాలా కీలకం. దీనికి కూడా ప్లాన్ చేసే ఉంటారనటంలో సందేహంలేదు. పార్టీ వాళ్ళని న్యూట్రల్ పబ్లిక్‌గా ప్రొజెక్టు చేయటానికి ఏర్పాట్లు చేసుంటారు. మొత్తంమీద టీడీపీ అధికారంలోకి రావాలంటే లోకేష్ పాదయాత్ర ఒక్కటే లాస్ట్ హోప్ గా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది.