Telugu Global
Andhra Pradesh

జగన్ ని రెచ్చగొట్టేందుకే ఆ ఫొటో హైలైట్ చేస్తున్నారా..?

లోకేష్, షర్మిల కలసి ఉన్న ఫొటో, వీడియోలను పోస్ట్ చేస్తూ జగన్ ని టార్గెట్ చేస్తున్నారు టీడీపీ అభిమానులు.

జగన్ ని రెచ్చగొట్టేందుకే ఆ ఫొటో హైలైట్ చేస్తున్నారా..?
X

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తేనేటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులు హాజరయ్యారు. వైసీపీ మాత్రం దూరంగా ఉంది. ఇక్కడ ఒక ఫొటో హైలైట్ అయింది. మంత్రి నారా లోకేష్, ఏపీసీసీ చీఫ్ షర్మిల ఒకరికొకరు నమస్కారం పెట్టుకున్నారు. ఆ ఫొటోని స్వయంగా నారా లోకేష్ ట్విట్టర్లో పెట్టారు. కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వివిధ పార్టీల నాయకులను ఆప్యాయంగా పలకరించి వారితో కాసేపు మాట్లాడాను అంటూ ట్వీట్ చేశారు లోకేష్.


అంతా బాగానే ఉంది కానీ నారా లోకేష్, షర్మిల ఫొటో మాత్రం కాస్త స్పెషల్ గా ఉంది. వారిద్దరూ కలసి మాట్లాడుకున్న వీడియోని కూడా కొందరు టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సొంత అన్న జగన్ పట్టించుకోకపోయినా.. నారా లోకేష్ మాత్రం ఏమ్మా బాగున్నావా అంటూ షర్మిలను ఆప్యాయంగా పలకలించారని కామెంట్లు పెడుతున్నారు. లోకేష్, షర్మిల కలసి ఉన్న వీడియోని పోస్ట్ చేస్తూ జగన్ ని టార్గెట్ చేస్తున్నారు టీడీపీ అభిమానులు.

ఏపీలో అధికార పార్టీని ఏమాత్రం విమర్శించకుండా.. పదే పదే ప్రతిపక్ష వైసీపీని టార్గెట్ చేస్తున్నారు షర్మిల. కుటుంబ వివాదాలను రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరీ ఆమె తన అన్న జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మీ జగనే సీఎంగా ఉండి ఉంటే.. అంటూ ఆయన చెబుతున్న మాటలకు టీడీపీ కౌంటర్ ఇవ్వకపోయినా.. షర్మిల మాత్రం కౌంటర్లిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆమె వైసీపీ ఓట్లను చీల్చేందుకు ప్రయత్నించారనే వాదన కూడా ఉంది. ఇప్పుడు లోకేష్ తో ఆమె ఆప్యాయంగా మాట్లాడిన తీరు చూస్తే.. షర్మిల కచ్చితంగా టీడీపీ కోసం పరోక్షంగా పనిచేస్తున్నారనే వాదన బలపడుతుంది. షర్మిల కాంగ్రెస్ కోసం పనిచేసినా, టీడీపీకి వంత పాడినా ఎవరికీ నష్టం లేదు కానీ.. మధ్యలో జగన్ ని టార్గెట్ చేస్తూ పదే పదే సెటైర్లు వేయడం మాత్రం వైసీపీ నాయకులకు ఆశ్చర్యంగా ఉంది.

First Published:  15 Aug 2024 7:01 PM IST
Next Story