జగన్ రెడ్డి డిగ్రీ చదవలేదా? ఇంగ్లీషు రాదా? - లోకేష్ ఆరోపణలపై వైసీపీ, జగన్ సొంత మీడియా మౌనం
ఉండవల్లి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ మీడియా ప్రతినిధులు ఉండగానే ఈ ఆరోపణలు చేశారు. వైసీపీ నుంచి ఈ ఆరోపణలపై ఖండన రాలేదు. జగన్ సొంత మీడియా కూడా సీఎం చదువుపై లోకేష్ చేసిన ఆరోపణలు తిప్పికొట్టలేదు.
``సీఎంకి పెద్దగా ఇంగ్లీషు వచ్చు అని నేను అనుకోవడం లేదు. ఆయన డిగ్రీ ఎక్కడ చేశాడో తెలియదు. జగన్ రెడ్డి అఫిడవిట్లో డిగ్రీ చూసి వారి నాయకులని అడిగాను. వారి నుంచి సమాధానం రాలేదు. జగన్ చిన్న వయస్సులోనే టెన్త్ పరీక్ష పత్రాలు లీక్ కేసులో పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.`` అంటూ మీడియా ముఖంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతీ విషయానికి కౌంటర్ ఎటాక్ చేసే వైసీపీ ఈ విషయంలో మాత్రం 24 గంటలైనా ఇంకా స్పందించలేదు. ఉండవల్లి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ మీడియా ప్రతినిధులు ఉండగానే ఈ ఆరోపణలు చేశారు. వైసీపీ నుంచి ఈ ఆరోపణలపై ఖండన రాలేదు. జగన్ సొంత మీడియా కూడా సీఎం చదువుపై లోకేష్ చేసిన ఆరోపణలు తిప్పికొట్టలేదు. దీంతో టిడిపి సర్కిళ్లు, సోషల్ మీడియాలో జగన్ రెడ్డి విద్యార్హతలకు సంబంధించిన మరిన్ని అనుమానాలు రేకెత్తించే డాక్యుమెంట్లను ప్రచారంలోకి తెచ్చారు. సండూర్ పవర్ ఎండీగా 2006లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నియమించేటప్పుడు ఎనర్జిటిక్ ఎంబీఏగా, 2009లో ఎంపీగా అఫిడవిట్ ఇచ్చేటప్పుడు బి.కామ్ అని పేర్కొన్న పత్రాలను విడుదల చేశారు. అమెరికాలో డిగ్రీ చదవటానికి వెళ్లి, ఏడాది కూడా లేకుండా తిరిగి వచ్చేసిన జగన్ రెడ్డి ఎక్కడా డిగ్రీ పూర్తి చేశారో ఎవ్వరికీ తెలియదని సాక్ష్యాలు చూపుతున్నారు. ఓ సారి ఎంబీఏ, మరోసారి బీకాం చదివారని చెబుతున్న జగన్ ఇంతకీ ఏం చదివారో? ఎక్కడ చదివారో చెప్పగలరా? అంటూ నారా లోకేష్ సవాల్ విసరడంపై స్పందనలేదు. కనీసం సోషల్ మీడియాలో డాక్యుమెంట్లు తిరుగుతున్నా జగన్ సొంత మీడియా, వైసీపీ సోషల్ మీడియా నుంచి కౌంటర్ రాలేదు. ఇది వ్యూహాత్మక మౌనమా? ఆలస్యంగా స్పందిస్తారా అనేది వేచి చూడాలి.