Telugu Global
Andhra Pradesh

బాబు మోసాలు, వెన్నుపోట్లకు దేవుడిచ్చిన గిఫ్ట్‌ లోకేశ్‌..

75 ఏళ్ల వయసున్న చంద్రబాబును ముసలోడనక ఇంకేమనాలని ఆయన ప్రశ్నించారు. లోకేశ్‌ పెర్ఫార్మెన్స్‌తో తెలంగాణలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.

బాబు మోసాలు, వెన్నుపోట్లకు దేవుడిచ్చిన గిఫ్ట్‌ లోకేశ్‌..
X

చంద్రబాబు చేసిన మోసాలు, వెన్నుపోట్లకు దేవుడిచ్చిన గిఫ్ట్‌ లోకేశ్‌ అని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఎద్దేవా చేశారు. మంగళవారం గుడివాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన 14 సంవత్సరాల కాలంలో తన విజన్‌తో ప్రజలకు పనికొచ్చే ఒక్క పథకమైనా అమలు చేసినట్టు చెప్పగలరా అని నాని ప్రశ్నించారు. సీఎం జగన్‌లా చంద్రబాబు ప్రజలకు చేసిన మేలు లేదు కాబట్టే.. అది చెప్పుకోలేక ఉత్త పుత్రుడు, దత్త పుత్రుడు, వదినమ్మ, చెల్లెమ్మలతో కలిసి ఎన్నికలకు వస్తున్నాడని ఆయన విమర్శించారు.

లోకేశ్‌ బ్రెయిన్‌లెస్‌ కిడ్‌ అని కొడాలి నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నవ యువకుడంటూ లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన పైవిధంగా స్పందించారు. 75 ఏళ్ల వయసున్న చంద్రబాబును ముసలోడనక ఇంకేమనాలని ఆయన ప్రశ్నించారు. లోకేశ్‌ పెర్ఫార్మెన్స్‌తో తెలంగాణలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.

వైసీపీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని తన కుటుంబసభ్యుడిగానే జగన్‌ భావిస్తారని కొడాలి నాని చెప్పారు. సామాజిక సమీకరణాల వల్ల మంగళగిరి సీటును వేరే అభ్యర్థికి ఇస్తున్నట్టు చెప్పడంతో మనస్తాపానికి గురైన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆవేశంతో పార్టీ వదిలారని, తర్వాత బాగా ఆలోచించి తిరిగి వచ్చారని ఆయన తెలిపారు. జగన్‌తో పనిచేసిన ఎవరైనా సీటు వచ్చినా రాకపోయినా ఆయనతో కలిసి నడవడానికి ఇష్టపడతారని కొడాలి నాని ఈ సందర్భంగా చెప్పారు.

First Published:  21 Feb 2024 8:17 AM IST
Next Story