చంద్రబాబుతోనే పోటీ పడుతున్నాడా?
కడప జిల్లాలో జరుగుతున్న యువగళం పాదయాత్ర సందర్భంగా రాయలసీమ అభివృద్దిపై లోకేష్ చర్చా వేదికను నిర్వహించాడు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన హామీలు వింటే ఎవరికైనా మతిపోవాల్సిందే. టీడీపీ అధికారంలోకి రాగానే కడపలో స్పోర్ట్స్ యూనివర్సిటినీ ఏర్పాటు చేస్తారట. స్పోర్ట్స్ క్యాపిటిల్ ఆఫ్ ఇండియాగా కడపను డెవలప్ చేస్తామని హామీ ఇచ్చాడు.
నారావారి పుత్రరత్నం లోకేష్ ఏమాత్రం తగ్గటంలేదు. హామీలివ్వటంలో తండ్రి నారా చంద్రబాబు నాయుడుతో పోటీ పడుతున్నాడు. యువగళం పేరుతో లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం కడప జిల్లాలో జరుగుతున్న విషయం తెలిసిందే. పాదయాత్ర సందర్భంగా రాయలసీమ అభివృద్దిపై లోకేష్ చర్చా వేదికను నిర్వహించాడు. ఈ సందర్భంగా ఇచ్చిన హామీలు వింటే ఎవరికైనా మతిపోవాల్సిందే. టీడీపీ అధికారంలోకి రాగానే కడపలో స్పోర్ట్స్ యూనివర్సిటినీ ఏర్పాటు చేస్తారట. స్పోర్ట్స్ క్యాపిటిల్ ఆఫ్ ఇండియాగా కడపను డెవలప్ చేస్తామని హామీ ఇచ్చాడు.
ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ నుండి అంతర్జాతీయ పోటీలకు క్రీడాకారులను పంపటమే టార్గెట్‌గా పెట్టుకున్నారట. అన్ని రకాల క్రీడలకు యూనివర్సిటిలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తామన్నారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, టైగర్ టూరిజం డెవలప్ చేస్తామన్నారు. అనంతపురం జిల్లాను ఆటోమొబైల్ హబ్‌గా తయారు చేస్తారట. చిత్తూరు జిల్లాను ఎలక్ట్రానిక్ తయారీ హబ్‌గా, కర్నూలు జిల్లాను వ్యవసాయ పరికరాల తయారీ హబ్, ఇండస్ట్రియల్ క్యారిడార్ కేంద్ర బిందువుగా చేస్తారట.
వినటానికి లోకేష్ హామీలన్నీ బాగానే ఉన్నాయి. అయితే 2014-19 మధ్యలో రాయలసీమ జిల్లాల్లో పైవన్నీ ఎందుకు డెవలప్ చేయలేదు? డెవలప్ చేస్తానంటే రాయలసీమ జనాలు వద్దన్నారా? అప్పుడు కూడా రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు చాలా హామీలే ఇచ్చారు. మరి వాటిల్లో ఎన్నింటిని నెరవేర్చారో చెబితే బాగుంటుంది. హామీలదేముంది ఇవ్వటానికి ఖర్చా పాడా అన్నట్లుగా ఉంటుంది తండ్రి, కొడుకుల వ్యవహారం.
అమరావతిలో ఒలంపిక్స్ నిర్వహించబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అమరావతిలో అంతర్జాతీయ స్టేడియంలను నిర్మించేస్తానన్నారు. ఒలంపిక్స్ లో బంగారు పతకాలు తెచ్చేవాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. నోటికొచ్చింది మాట్లాడేయటం, బుద్దికి తోచిన హామీలిచ్చే అలవాటు చంద్రబాబు నుండే లోకేష్‌కు వచ్చుండాలి. రాయలసీమ డెవలప్‌మెంట్‌కు ఏమేమి చేయబోతున్నది అసెంబ్లీ సాక్షిగా అధికారంలోకి వచ్చిన కొత్తలో చంద్రబాబు ప్రకటించారు. అంతే తర్వాత ఆ డ్రాఫ్ట్ ఏమైందో కూడా ఎవరికీ తెలియదు. పైగా అనంతపురం, తిరుపతికి మంజూరైన ప్రతిష్టాత్మక సంస్థలను కూడా అమరావతికే తరలించారు. మరి లోకేష్ ఏమిచేస్తారో చూడాల్సిందే.