లోకేష్ కూడా మంగళగిరి వదిలి పారిపోవాల్సిందేనా..?
2024నాటికి ఆయన ఏమేరకు పుంజుకున్నారనే విషయం పక్కనపెడితే వైసీపీ వ్యూహాలతో లోకేష్ భయపడిపోతున్నారనేది మాత్రం వాస్తవం.
చీపురుపల్లిలో గంటా చేతులెత్తేశారు..
అనకాపల్లిలో నాగబాబు తోకముడిచారు..
పి.గన్నవరం నుంచి మహాసేన రాజేష్ పారిపోయారు..
కూటమిలో ఓటమి భయం మొదలైందనడానికి ఈ ఉదాహరణలు చాలు. ఇప్పుడు నారా లోకేష్ కూడా మంగళగిరి తనకు సేఫ్ ప్లేస్ కాదని భావిస్తున్నారు. 2019లో మంత్రిగా ఉండి కూడా ఇక్కడ ఓటమి చవిచూశారు లోకేష్. 2024నాటికి ఆయన ఏమేరకు అక్కడ పుంజుకున్నారనే విషయం పక్కనపెడితే వైసీపీ వ్యూహాలతో లోకేష్ భయపడిపోతున్నారనేది మాత్రం వాస్తవం. లోకేష్ ప్రత్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈసారి అక్కడ టికెట్ ఇవ్వకుండా వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. బీసీ అభ్యర్థితో లోకేష్ ని ఓడించాలనేది ఆయన ఆలోచన. ముందుగా మంగళగిరి వైసీపీకి గంజి చిరంజీవిని ఇన్ చార్జ్ గా ప్రకటించారు, తాజాగా అక్కడ మురుగుడు లావణ్యకు ఆ బాధ్యతలు అప్పగించారు.
లోకేష్ డైలమా..
చిరంజీవిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఎమ్మెల్యే ఆర్కే వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరడంతో లోకేష్ సంబరపడ్డారు. ఆ తర్వాత ఆర్కే తిరిగి జగన్ దగ్గరకు రావడం, చిరంజీవి స్థానంలో మహిళా అభ్యర్థి లావణ్యకు ఆ సీటు అప్పగించడంతో వైసీపీలో ఉన్న చిన్నపాటి అసంతృప్తులన్నీ తొలగిపోయాయి. లోకేష్ లో గెలుపుపై అనుమానాలు మొదలయ్యాయి. వార్ వన్ సైడ్ గా మారింది.
జగన్ బీసీ మంత్రం..
మంగళగిరిలో చేనేత సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. అదే సామాజిక వర్గం నుంచి మహిళా అభ్యర్థిని తెరపైకి తెచ్చారు సీఎం జగన్. లోకేష్ మాత్రం ఈసారి గెలుపుకోసం కోట్లు కుమ్మరించాలని డిసైడ్ అయ్యారు. చోటా మోటా నేతలందర్నీ ఈపాటికే తనవైపు తిప్పుకున్నారు. తోడుపు బండ్లు, సిమెంట్ బెంచీలు.. అంటూ రెండేళ్ల ముందునుంచే డ్రామాలు మొదలు పెట్టారు. అయితే నేతన్నలతోపాటు బీసీ ఓట్లన్నీ వైసీపీకే గంపగుత్తగా పడే అవకాశముంది. దీంతో లోకేష్ కి మంగళగిరి ఏమాత్రం సేఫ్ ప్లేస్ కాదని తేలిపోయింది.