Telugu Global
Andhra Pradesh

రాష్ట్రంలో అల్లర్లకు లోకేశ్ కుట్ర.. - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

గత మూడేళ్లుగా రాష్ట్రం ప్రశాంతంగా ప్రగతిపథంలో నడుస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఏ కారణం లేకుండానే బురద జల్లేందుకు లోకేష్‌ అండ్‌ టీం విశ్వప్రయత్నాలు చేస్తోంద‌ని మండిపడ్డారు.

రాష్ట్రంలో అల్లర్లకు లోకేశ్ కుట్ర.. - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
X

ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని నారా లోకేశ్ అండ్ టీం కుట్రలు చేస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడం టీడీపీకి ఇష్టం లేదని పేర్కొన్నారు. అందుకే శ్రీకాకుళం జిల్లా పలాస కేంద్రంగా అలజడి రేపాలని లోకేశ్ అండ్ టీం కుట్రలు చేసిందని వాపోయారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గత మూడేళ్లుగా రాష్ట్రం ప్రశాంతంగా ప్రగతిపథంలో నడుస్తోందన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఏ కారణం లేకుండానే బురద జల్లేందుకు లోకేష్‌ అండ్‌ టీం విశ్వప్రయత్నాలు చేస్తోంద‌ని మండిపడ్డారు.

సాధారణ పరిపాలనకు సంబంధించిన చిన్న విషయాలను సైతం సమస్యలుగా చూపించి టీడీపీ నేతలు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని వాపోయారు. పలాస మునిసిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కోర్టు ఆదేశాల ప్రకారం అధికారులు తొలగిస్తుంటే దాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పచ్చ పార్టీ నేతల ఆగడాలు సాగనివ్వబోమని పేర్కొన్నారు.

అరాచకాలు అడ్డుకుంటాం

టీడీపీ చేస్తున్న అరాచక రాజకీయాలను రాష్ట్రంలో సాగనివ్వబోమని, ఎప్పటికప్పుడు అడ్డుకుంటామని విజయసాయిరెడ్డి అన్నారు. పలాస పురపాలక సంఘం పరిధిలో 'అర్ధరాత్రి కూల్చివేతలు, అక్రమ అరెస్టులు' అంటూ ఉత్తరాంధ్రలో లోకేష్, ఆయన భజన బృందం డ్రామాలు మొదలుపెట్టాయన్నారు. అమరావతిలో నారా చంద్రబాబు నాయుడు కొన్ని రోజులుగా వీరంగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో చట్ట విరుద్ధంగా తీసుకుంటున్న అక్రమ చర్యలు ఏవీ లేవని స్పష్టం చేశారు.

ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రలో నిప్పురాజేసి దాన్ని రాష్ట్రమంతటా అంటించడానికి తెలుగుదేశం చేసిన ప్రయత్నం పారలేదని వెల్లడించారు. విశాఖను పాలనా రాజధానిగా కాకుండా చేసేందుకు టీడీపీ సర్వశక్తులూ ఒడ్డి అడ్డుకుంటోందని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజానీకం తెలుగుదేశం ఆగడాలను సహించబోరని పేర్కొన్నారు. ఇకనైనా టీడీపీ నేతలు ఈ విషయాన్ని గ్రహిస్తే మంచిదని హితపు పలికారు.

First Published:  23 Aug 2022 5:12 PM IST
Next Story