Telugu Global
Andhra Pradesh

కోర్టులే తప్పుచేశాయా?

భువనేశ్వరి ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటమే కావ‌చ్చు. కానీ ఆమె మాటల్లో టార్గెట్ చేస్తున్నది కోర్టులనే. ఎందుకంటే చంద్రబాబును అరెస్టు చేసింది సీఐడీ ఉన్నతాధికారులు. అయితే రిమాండుకు పంపింది మాత్రం ఏసీబీ కోర్టే.

కోర్టులే తప్పుచేశాయా?
X

ఎల్లో మీడియానే అనుకుంటే నారా భువనేశ్వరి కూడా కోర్టులను తప్పుపడుతున్నారు. తన భర్త ఎలాంటి అవినీతికి పాల్పడకపోయినా అవినీతి మరక అంటించి 17 రోజులుగా జైల్లో పెట్టారని తీవ్రంగా ఆరోపించారు. భువనేశ్వరి ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటమే కావ‌చ్చు. కానీ ఆమె మాటల్లో టార్గెట్ చేస్తున్నది కోర్టులనే. ఎందుకంటే చంద్రబాబును అరెస్టు చేసింది సీఐడీ ఉన్నతాధికారులు. అయితే రిమాండుకు పంపింది మాత్రం ఏసీబీ కోర్టే.

ఇదే సమయంలో చంద్రబాబు తరపు లాయర్లు దాఖలు చేసిన క్వాష్ పిటీష‌న్‌ను డిస్మిస్ చేసింది హైకోర్టు. క్వాష్ పిటీషన్ డిస్మిస్ చేయటాన్ని చాలెంజ్ చేస్తు లాయర్లు వేసిన లంచ్ మోషన్ పిటీషన్‌ను కూడా కొట్టేసింది హైకోర్టే. అంటే రిమాండుకు పంపిన ఏసీబీ కోర్టు, క్వాష్ పిటీషన్‌ను కొట్టేసిన హైకోర్టు కూడా చంద్రబాబుపై కక్షకట్టినట్లేనా? చంద్రబాబు మీద జగన్మోహన్ రెడ్డి కక్షకట్టారంటే అర్థ‌ముంది? కక్షకట్టాల్సిన అవసరం కోర్టులకు ఏముంటుంది?

స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టు కూడా ఏకీభవించింది. అందుకనే రిమాండు విధించింది. చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని ఆరోపించి అందుకు ఆధారాలను చూపించిన సీఐడీ లాయర్ల వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు 11 రోజులు రిమాండు పొడిగించింది. ఇదే సమయంలో స్కిల్ స్కామ్‌తో చంద్రబాబుకు సంబంధంలేదని ఆయన తరపు లాయర్లు సమర్థ‌వంతంగా వాదించలేకపోయారు. ఎందుకంటే చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు సీఐడీ డాక్యుమెంటరీ ఎవిడెన్సులను చూపించి జడ్జీని కన్వీన్స్ చేయగలిగింది.

కేసు మెరిట్ ప్రకారమే చంద్రబాబును కోర్టు రిమాండుకు పంపినా భువనేశ్వరితో పాటు లోకేష్, బ్రాహ్మణితో పాటు తమ్ముళ్ళు, ఎల్లో మీడియా తట్టుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ మీద కోపంతో చివరకు కోర్టులను కూడా తప్పుపట్టే స్థాయికి చేరుకుంటున్నారు. జగన్+కోర్టులు ఏకమైపోయి చంద్రబాబును రిమాండుకు పంపినట్లు ఎల్లో మీడియా కథనం ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. చివరకు కోర్టులను కూడా బహిరంగంగా తప్పుపడుతున్నారంటే వీళ్ళ మానసికస్థితి ఎలా ఉందో అర్థ‌మైపోతోంది.


First Published:  26 Sept 2023 11:03 AM IST
Next Story