ఎన్టీఆర్ పేరు మార్పుపై బాలకృష్ణ రియాక్షన్
ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడంపై తొలిసారిగా ఎన్టీఆర్ కుమారుడు, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఈ మేరకు ఆయన శనివారం ఆయన ఒక లేఖ మీడియాకు విడుదల చేశారు.

ఎన్టీఆర్ ఒక మహా పురుషుడని, ఆయన పేరు ఎలా మారుస్తారని బాలకృష్ణ ప్రశ్నించారు.
మార్చేయడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ మామూలు వ్యక్తి కాదని.. ఆయన ఒక సంస్కృతి, ఒక మహా పురుషుడు, తెలుగు జాతి వెన్నెముక అని ఆ లేఖలో బాలయ్య స్పష్టం చేశారు.
తండ్రి గద్దెనెక్కి విమానాశ్రయం పేరు మార్చారు. కొడుకు గద్దెనెక్కి వర్సిటీ పేరు మారుస్తున్నారు.. అని ఆ లేఖలో పేర్కొన్నారు. మిమ్మల్ని మార్చేయడానికి ప్రజలు ఉన్నారు.. పంచ భూతాలు ఉన్నాయి.. తస్మాత్ జాగ్రత్త.. అంటూ హెచ్చరికలు జారీ చేశారు.
అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయని బాలకృష్ణ తన లేఖలో పేర్కొన్నారు. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు.. అంటూ చాలా ఘాటుగా ఆయన రియాక్టయ్యారు.