టీటీడీ ఛైర్మన్‌గా నాగబాబు..?
నాగబాబును టీటీడీ ఛైర్మన్‌గా నియమించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముందు జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ డిమాండ్ పెట్టినట్లు సమాచారం.
ఏపీ కొత్త ప్రభుత్వంలో జనసేన నేత, పవన్‌కల్యాణ్ సోదరుడు నాగబాబుకు కీలక పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా నాగబాబును నియమించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా దీనిపై ప్రకటన వెలువడలేదు. ఈ అంశంపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
నాగబాబును టీటీడీ ఛైర్మన్‌గా నియమించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముందు జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ డిమాండ్ పెట్టినట్లు సమాచారం. నిజానికి జనసేన తరపున నరసాపురం లోక్‌సభ స్థానం లేదా మరో స్థానం నుంచి లోక్‌సభకు నాగబాబు పోటీచేస్తారని ప్రచారం జరిగింది. అయితే పొత్తుల నేపథ్యంలో పోటీ నుంచి విరమించుకున్నారు నాగబాబు. ఈ నేపథ్యంలోనే ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక మంత్రి పదవులపై చంద్రబాబుతో పవన్ చర్చలు జరుపుతున్నారని టాక్.
ఇటీవల టీటీడీ ఛైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరోవైపు విజయవాడ దుర్గ గుడి ఛైర్మన్ పోస్టుకు జనసేన నేత బాడిత శంకర్‌ను సుజనా చౌదరి, చిన్ని సిఫారసు చేస్తున్నట్లు సమాచారం. పదేళ్లుగా జనసేన కోసం కష్టపడుతున్న వారికి న్యాయం చేయాలని పవన్ భావిస్తున్నారు.