Telugu Global
Andhra Pradesh

ఎమ్మెల్సీ అభ్యర్థిగా రేపు నాగబాబు నామినేషన్‌

ఎమ్మెల్యే కోటాలో జనసేన అభ్యర్థిగా ఇప్పటికే పేరు ఖరారు

ఎమ్మెల్సీ అభ్యర్థిగా రేపు నాగబాబు నామినేషన్‌
X

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌ పత్రాలపై గురువారం రాత్రే ఆయన సంతకాలు చేశారు. కూటమి పొత్తులో భాగంగా ఒక స్థానం జనసేనకు కేటాయించారు. ఈ సీటు నుంచి నాగబాబు పేరును జనసేన చీఫ్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. నాగబాబును తమ కేబినెట్‌ లోకి తీసుకుంటామని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ఇదివరకే ప్రకటించారు. ఈక్రమంలోనే ఆయనను శాసన మండలికి పంపుతున్నారు.

First Published:  6 March 2025 10:17 PM IST
Next Story