Telugu Global
Andhra Pradesh

తగ్గేదే లేదు.. పెట్రోల్ పోసిన నాగబాబు

నాగబాబు మాత్రం.. ఏపీ మంత్రులు, బటన్ నొక్కడం అంటూ డైరెక్ట్ గానే అటాక్ చేశారు. మంత్రులంతా పనిలేనోళ్లు అనే స్టేట్ మెంట్ ఇచ్చారు. విషం కక్కడం, కారుకూతలు కూయడం, ఆకాశం మీద ఉమ్మడం.. వంటి ఘాటు పదాలు జోడించారు.

తగ్గేదే లేదు.. పెట్రోల్ పోసిన నాగబాబు
X

'బ్రో' నిప్పు చల్లారుతుందనుకుంటున్న వేళ, చిరంజీవి వ్యాఖ్యలు కాస్త ఆ మంటల్ని ఎగదోశాయి. వైసీపీ నుంచి ఓ రేంజ్ లో కౌంటర్లు పడుతున్నా కూడా ప్రస్తుతం చిరంజీవి సైలెంట్ గా ఉన్నారు. కానీ ఈసారి నాగబాబు ఊరుకోలేదు. ఏకంగా పెట్రోల్ పోశారు. ఈ మంట అప్పుడే చల్లారకుండా ట్వీట్ వేశారు. వైసీపీ మంత్రులపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు నాగబాబు.

నాగబాబు ఏమన్నారంటే..?

పనిలేనోడు పిల్లి తల గొరిగినట్టు నిజం మాట్లాడిన వ్యక్తిమీద విషం కక్కుతారా..?

ఆయన ఫొటోకోసం పడిగాపులు పడినవాళ్లు ఇప్పుడు కారుకూతల కూస్తున్నారు.

ఆకాశం మీద ఉమ్మాలని చూస్తే మీ ముఖం మీదే పడుతుంది..

మీ బతుక్కి మీ శాఖలమీద అవగాహన ఉండదు,అభివృద్ధికి అర్ధమే తెలియదు

బటన్ నొక్కి ఉచితాలు పంచడమే అభివృద్ధి అనుకుంటున్నారా..?

మీ ధౌర్భాగ్యపు దుర్మార్గపు పాలనకి ఎండ్ కార్డ్ దగ్గర్లోనే ఉంది..

అంటూ నాగబాబు ఓ సుదీర్ఘ ట్వీట్ వేశారు. శ్రమని పెట్టుబడిగా పెట్టి, పన్నుని ప్రభుత్వానికి అణాపైసలతో సహా కట్టి, వినోదాన్ని విజ్ఞానాన్ని జనానికి పంచిపెట్టి, 24 క్రాఫ్ట్ లకి అన్నం పెడుతున్న ఏకైన పరిశ్రమ చిత్రపరిశ్రమ అని చెప్పుకొచ్చారు నాగబాబు.


చిరంజీవిపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్న సందర్భంలో నాగబాబు ట్వీట్ వైరల్ గా మారింది. చిరంజీవి నేరుగా పేరు పెట్టలేదు కానీ, నాగబాబు మాత్రం ఏపీ మంత్రులు, బటన్ నొక్కడం అంటూ డైరెక్ట్ గానే అటాక్ చేశారు. మంత్రులంతా పనిలేనోళ్లు అనే స్టేట్ మెంట్ ఇచ్చారు. విషం కక్కడం, కారుకూతలు కూయడం, ఆకాశం మీద ఉమ్మడం.. వంటి ఘాటు పదాలు జోడించారు. ట్వీట్ పడిన నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఇక వైసీపీ నాయకులు మైకుల ముందుకు రావడమే తరువాయి. వచ్చాక అన్నదమ్ములు ముగ్గురికీ ఓ రేంజ్ లో కౌంటర్లు పడతాయనడంలో అనుమానం లేదు.

First Published:  9 Aug 2023 2:30 PM GMT
Next Story