వెధవలను గౌరవించను.. నాగబాబు ట్వీట్ ఎవరి గురించి..?
ట్వీట్ వేసి తిడుతూనే.. వారిని మరింత రెచ్చగొట్టేలా మరో సూచన కూడా చేశారు నాగబాబు.
నాగబాబు మళ్లీ హడావిడి మొదలు పెట్టారు. ఆమధ్య ఎంపీ సీటుకోసం తీవ్రంగా ప్రయత్నించి, చివరకు పొత్తుల్లో చిత్తైపోయి అద్దెకు తీసుకున్న ఇంటిని కూడా ఖాళీ చేసి వెళ్లిపోయిన నాగబాబు ఇప్పుడు ట్విట్టర్లో యాక్టివ్ గా కనపడుతున్నారు. ఈసారి ఆయన తన అక్కసునంతా వెళ్లగక్కారు. పెద్దలు, వెధవలు అంటూ సూక్తి ముక్తావళి మొదలు పెట్టారు. అయితే నాగబాబు టార్గెట్ ఎవరా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
( గమనిక: ఏమి మాట్లాడిన మా గురించే ఏమో అని ఆపాదించుకుంటున్నారు,ఇది ఎన్నికల సమర సమయం నా ఉద్దేశాలు చెప్తున్న తప్ప ఎవరిని ఉద్దిషించి కాదు పైన చెప్పింది జీవిత సత్యం) pic.twitter.com/HhOfVu4igE
— Naga Babu Konidela (@NagaBabuOffl) March 21, 2024
"వయసు ఎక్కువ, పెద్దవాడు.. అని ప్రతి వెధవని గౌరవించక్కర్లేదు. ఎందుకంటే వెధవలు కూడా పెద్దవాళ్లవుతారు." ఇది కన్ఫ్యూషియస్ మాటగా చెప్పుకొచ్చారు నాగబాబు. అయితే తాను ఎవరిని తిడుతున్నాననే విషయాన్ని ఆయన నేరుగా ప్రస్తావించలేదు. అయితే ఆయన సూక్తి వింటే మాత్రం ఎవరో వయసులో పెద్దవారైన వారు సలహా ఇవ్వబోతే, అది నచ్చక నాగబాబు ఈ ట్వీట్ వేసినట్టు తెలుస్తోంది. గతంలో పవన్ కల్యాణ్ కూడా తనకెవరూ సలహాలివ్వద్దని కాపు పెద్దలపై సీరియస్ అయ్యారు. మరిప్పుడు నాగబాబు ఆగ్రహం ఎవరిపైనో తేలాలి.
ట్వీట్ వేసి తిడుతూనే.. వారిని మరింత రెచ్చగొట్టేలా మరో సూచన కూడా చేశారు నాగబాబు. తాను ఏమి మాట్లాడినా అది తమ గురించేనేమో అని కొంతమంది ఆపాదించుకుంటున్నారని, ఇది ఎన్నికల సమర సమయం కాబట్టి తన ఉద్దేశాలు మాత్రమే చెబుతున్నానని అన్నారు. అంతే తప్ప ఈ ట్వీట్ ఎవరినీ ఉద్దేశించి కాదని అన్నారు. పైగా అది జీవిత సత్యం అని పేర్కొన్నారు నాగబాబు.