కుహనా మేధావులు.. నాగబాబు టార్గెట్ ఎవరు..?
“సినిమాల వల్ల జనాలు చెడిపోతున్నారు అని ఏడ్చే కుహనా మేధావులకు ఇది ఆన్సర్. సినిమాల్లో ఏదన్నా ఓవర్ గా ఉంటే సెన్సార్ బోర్డ్ ఉంది. కుహనా మేధావులు ఏడవకండి.” అంటూ ట్వీట్ చేశారు నాగబాబు.
ఇటీవల రాజకీయాలపై, ముఖ్యంగా వైసీపీ నాయకులపై సెటైర్లు పేలుస్తున్న జనసేన నేత, సినీ నటుడు నాగబాబు.. తాజాగా కేవలం సినిమాలను ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ వేశారు. ఉన్నట్టుండి నాగబాబు సినిమాల గురించి మాట్లాడాల్సిన సందర్భం కూడా ఇప్పుడు లేదు, మెగా ఫ్యామిలీ సినిమా ఆల్రడీ వచ్చి వెళ్లిపోయింది. ప్రస్తుతం కొత్త సినిమాలేవీ లైన్లో లేవు. అయినా ఇప్పుడు ఇలా నాగబాబు ట్వీట్ వేస్తారని ఎవరూ ఊహించలేదు. కుహనా మేధావులంటూ నాగబాబు ఎవరిని టార్గెట్ చేశారు, ఎందుకు టార్గెట్ చేశారనేదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ.
సినిమాల్లో చూపించే voilence వల్ల జనాలు చెడిపోతారు అనుకుంటే ,మరి సినిమాల్లో చూపించే మంచి వల్ల జనాలు బాగుపడాలి కదా .as a film maker గా ఒకటి నిజం ,సినిమాలు entertainment కోసమే ,జనాన్ని బాగు చెయ్యటం కోసమో చెడగొట్టాడని కోసమో తేసేంత గొప్పవాళ్ళు లేరిక్కడ .its జస్ట్ ఆ business .
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 7, 2023
సినిమా అంటే కేవలం వ్యాపారం అని, ఎంటర్టైన్మెంట్ మాత్రమేనంటున్నాటు నాగబాబు. “సినిమాల వల్ల జనాలు చెడిపోతున్నారు అని ఏడ్చే కుహనా మేధావులకు ఇది ఆన్సర్. సినిమాల్లో ఏదన్నా ఓవర్ గా ఉంటే సెన్సార్ బోర్డ్ ఉంది. కుహనా మేధావులు ఏడవకండి.” అంటూ ట్వీట్ చేశారు నాగబాబు.
వాస్తవానికి కుహనా మేధావులు, సినిమాలపై పడి ఏడ్చేవారు, సినిమా వాళ్లకి వార్నింగ్ ఇచ్చేవాళ్లు అంటే వెంటనే బీజేపీ, దాని అనుబంధ విభాగాల వారే గుర్తొస్తారు. ఇటీవల కాలంలో షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా విషయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు ఎంత రాద్ధాంతం చేశారో తెలిసిందే. కొన్నిచోట్ల వారి కారణంగా పఠాన్ సినిమా ప్రదర్శనకు కూడా నోచుకోలేదు. మరి నాగబాబు ఇంత గ్యాప్ తీసుకుని మరీ బీజేపీ వాళ్లను టార్గెట్ చేశారా..? లేక నాగబాబు టార్గెట్ ఇంకెవరైనా ఉన్నరా అనేది తేలాల్సి ఉంది. అయితే ఈలోగానే ఆయన ట్వీట్ వైరల్ గా మారింది. సినిమా అంటే బిజినెస్, ఎంటర్టైన్మెంట్ అంటున్నారు కదా.. మరి కలెక్షన్లు వచ్చినప్పుడు మంచి సందేశం ఇచ్చామంటూ సినిమావాళ్లు గొప్పలు చెప్పుకుంటారెందుకు.. అంటూ చాలామంది ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. నాగబాబు ట్వీట్ కి పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నవారికంటే, నెగెటివ్ గా కామెంట్లు పెడుతున్నవారే ఎక్కువ. మొత్తమ్మీద రాజకీయాలను టచ్ చేయకుండా కూడా నాగబాబు కాంట్రవర్శీని క్రియేట్ చేయగలరు అని మరోసారి రుజువు చేసుకున్నారు.