పవన్ జనసేనకి 72 సీట్లు..? జగన్మోహన్‌రెడ్డికి తియ్యని కబురు..!
కోస్తా, ఉత్తరాంధ్రలోనే టీడీపీ సత్తా చూపించాలి. అంటే తెలుగుదేశం స్వీప్‌చేయాలి. అదంత వీజీకాదు. జగన్ పార్టీ ధనంతో, జనబలంతో గట్టిగా నిలబడి ఉంది. జగన్ పని అయిపోయింది అని ప్రచారం చేసినంత తేలిక కాదు జగన్ని ఓడించడం.
కమ్మవాళ్లకీ, కాపులకీ తెనాలి మీదుగా స్నేహవారధి నిర్మించే పనిలో ఉన్న నాదెండ్ల మనోహర్ ఒక కమ్మటి కబురు చెప్పారు. చంద్రబాబునాయుడు అనే దయాళువు పవన్ కల్యాణ్ పార్టీకి 72 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వబోతున్నారని ప్రకటించారు. ఓహో.. చాలా బాగుంది. ఇది నిజంగా జనసేన విజయమే. గాజుగ్లాసు అమృతంతో నిండినట్టే ఉంది. పంట పండినట్టే ఉంది. అయినా ఓ చిన్నారి సందేహం.., పవన్ కల్యాణ్ అనే పవర్ స్టార్ గతంలో పోటీ చేసిన రెండుస్థానాల్లోనూ అవమానకరంగా ఓడిపోయిన హీరో.. ఇప్పుడు ఏకంగా 72 స్థానాల్లో గెలుస్తారా అని..!
సీట్లు కేటాయించగానే సంబరం కాదు, ఓట్లు వేయించుకోగలగాలోయ్ వెర్రిరి నాగన్నా..! ఒకనాడు ప్రజారాజ్యం అంటూ తుఫాన్‌లా విరుచుకుపడిన మెగాస్టార్ చిరంజీవి, చివరికి గెలుచుకున్నవి 18 స్థానాలే అని గుర్తుందా..? లేదా..?
నిజంగా నాదెండ్ల మనోహర్ చెప్పిన మాట గనుక నిజం అయితే, 72 సీట్లూ పవన్ ఒళ్లో పడితే ఎన్ని గెలవగలడు..? పవన్‌కి ఒక ఊపు ఉంది గనక, 20 సీట్లు గెలిచే అవకాశం ఉండొచ్చని ఒక కమ్మ అంచనా. 30 సీట్లు దాకా గెలవగలం అని కాపు ఆలోచన. ఇంతకీ 72 జనసేనకిస్తే, ఘనత వహించిన తెలుగుదేశం పార్టీకి మిగిలేవి నూటమూడు సీట్లు మాత్రమే..! జనసేన గనక ఇరవై గ్యారంటీగా గెలిస్తే, ఆ 103లో 70 సీట్లన్నా చంద్రబాబు గెలవగలగాలి. రాయలసీమలో ఫ్యాన్ గాలి బలంగా వీస్తోంది గనక, ఇక కోస్తా, ఉత్తరాంధ్రలోనే టీడీపీ సత్తా చూపించాలి. అంటే తెలుగుదేశం స్వీప్‌చేయాలి. అదంత వీజీకాదు. జగన్ పార్టీ ధనంతో, జనబలంతో గట్టిగా నిలబడి ఉంది. జగన్ పని అయిపోయింది అని ప్రచారం చేసినంత తేలిక కాదు జగన్ని ఓడించడం.
ఒక చిన్న క్లారిటీ.. 72లో ఇరవయ్యో, ఇరవై రెండో పవన్ కల్యాణ్ పార్టీ గెలుచుకుంటుంది అనుకుంటే మిగిలిన యాభై సీట్లూ జగన్ పార్టీకి వస్తాయనేగా. ఇక టీడీపీకి మిగిలిన 103 అసెంబ్లీ స్థానాల్లో జగన్–చంద్రబాబు సగం సగం గెలుచుకున్నా, జగన్ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలడు. అందుకే నాదెండ్ల వారు చెప్పింది జగన్‌కి మనోహరమైన మాట. శుభవార్త.
సొంతగొయ్యిని తవ్వుకోవడంలో స్పెషలిస్ట్ అయిన చంద్రబాబు, కాపుల్ని వాడుకొని ముఖ్యమంత్రి అయిపోదాం అనే తొందరపాటులో గాజుగ్లాసు మీద కాలేసి జారిపడేట్టు ఉన్నారు. పాదాల్లో గాజుపెంకులు గుచ్చుకున్నాక, నువ్వు నడవనూ లేవు, ఈ మాయదారి ఎన్నికల్లో గెలవనూ లేవు. సరేగానీ, ఇంతకీ మన బ్రో మనోహర్ గెలుస్తాడంటారా..? అతన్ని కాపులే ఓడించే పరిస్థితి దాపురిస్తుందేమో..!
May Babu Bless him