మార్ఫింగ్ అంటూ సీఐడీకి ఎంపీ ఫిర్యాదు
రాజకీయంగా తనపై కక్ష కట్టిన కొందరు మార్ఫింగ్ చేసి న్యూడ్ వీడియోని సృష్టించారని సీఐడీకి ఎంపీ గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు.
BY Telugu Global6 Sept 2022 4:00 PM IST

X
Telugu Global Updated On: 7 Sept 2022 12:18 PM IST
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయంగా తనపై కక్ష కట్టిన కొందరు మార్ఫింగ్ చేసి న్యూడ్ వీడియోని సృష్టించారని సీఐడీకి ఎంపీ గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ చేసిన వీడియోను ఐటీడీపీ సోషల్ మీడియాలో మొదటిసారిగా పోస్ట్ చేశారని ఆధారాలను జత చేస్తూ, దర్యాప్తు జరపాల్సిందిగా సీఐడీ అడిషనల్ డీజీకి ఎంపీ మాధవ్ లేఖ రాశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ఐటీడీపీ పని చేస్తుందని.. నారా లోకేష్, చింతకాయల విజయ్ దిశానిర్దేశంలో ఇటువంటివి చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఎంపీ నుంచి అందిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. ఎఫ్‌ఐఆర్ నెంబరు 12/2022తో కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు.
Next Story