బీఆర్ఎస్‌లో కవితకు కీలక బాధ్యతలు?
ఈనెల 29వ తేదీన కవిత ఏపీలో పర్యటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలపైనే కవిత ప్రధానంగా దృష్టి పెట్టారట.
కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్‌లో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్లు సమాచారం. ఏపీ బీఆర్ఎస్ సమన్వయకర్తగా కేసీఆర్ తొందరలోనే కవితను ప్రకటించబోతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఇందుకు సూచన అన్నట్లుగా ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, పార్ధసారధి, రావెట కిషోర్ బాబు శనివారం కవితతో భేటీ అయ్యారు. ఏపీలో పార్టీని బలోపేతం చేసే విషయమై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
ఖమ్మంలో 18వ తేదీన జరగబోయే బహిరంగ సభ సక్సెస్‌లో వీళ్ళముగ్గురు పోషిస్తున్న పాత్రపై కవిత మాట్లాడారు. అలాగే బీఆర్ఎస్‌లో చేరబోయే ఏపీ నేతల విషయాన్ని కూడా కవిత వీళ్ళతో చర్చించారట. జిల్లాల్లో చేయాల్సిన పర్యటనలు, ఎవరెవరు పార్టీలో చేరేందుకు అవకాశాలున్నాయి, వాళ్ళ నేపథ్యం లాంటి అనేక అంశాలను తోట వివరించారట. ఇప్పటికే తన దూతలు ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపు ప్రముఖుల్లో కొందరిని కలిసిన విషయాన్ని కవితకు తోట వివరించారట.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఈనెలాఖరులో ఏపీలో కవిత పర్యటించే అవకాశాలున్నాయి. ఖమ్మం బహిరంగ సభ అయిన వెంటనే ఏపీ బీఆర్ఎస్‌కు కవితను సమన్వయకర్తగా కేసీఆర్ ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం. బీఆర్ఎస్‌లో చేరికలు, విస్తరణపైనే కవితపై ముగ్గురు నేతలతో చర్చించారు. ఈనెల 29వ తేదీన కవిత ఏపీలో పర్యటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలపైనే కవిత ప్రధానంగా దృష్టి పెట్టారట.
ఖమ్మం బహిరంగసభ అయిపోగానే అయిపోగానే ముందు ఏపీ ఇన్చార్జి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, శ్రీనివాసగౌడ్‌తో పాటుపై ముగ్గురు నేతలు భేటీ అవుతారట. ఆ తర్వాతే ఏపీలో కవిత పర్యటనలు ఉంటాయని పార్టీ వర్గాలు చెప్పాయి. పార్టీలోకి చేరికల విషయంలో ఎక్కువగా కాపు ప్రముఖులు, కుల సంఘాల నేతలపైనే కేసీఆర్ దృష్టి పెట్టినట్లు సమాచారం. కవిత పర్యటన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఫిబ్రవరిలో కేసీఆర్ కూడా ఏపీ పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయి. గుంటూరులో భారీ బహిరంగసభ నిర్వహించి ఆ సభలోనే ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించేందుకు ప్లాన్ జరుగుతోంది.