చంద్రబాబుకు మరో బకరా దొరికిందా..?
ప్రభుత్వ కాలపరిమితి అయిపోతున్న ఈ సమయంలో సడన్ గా ఎంఎల్సీకి జ్ఞానోదయం అయ్యింది. జగన్ హయాంలో బీసీలకు న్యాయం జరగలేదట. సామాజిక న్యాయం అన్నది కేవలం జగన్ మాటల్లోనే తప్ప ఆచరణలో ఎక్కడా చూపలేదట.
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు జాతకమో లేకపోతే ఫేస్ వాల్యూనో తెలీదు. బకరాలమవుతామని తెలిసినా కొందరు ఆయన్నే నమ్ముతారు. విషయం ఏమిటంటే.. వైసీపీ ఎంఎల్సీ జంగా కృష్ణమూర్తి త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారు. టీడీపీలో చేరటం డిసైడ్ చేసుకున్న తర్వాతే జగన్మోహన్ రెడ్డిపైన ఆరోపణలతో విరుచుకుపడ్డారు. విచిత్రం ఏమిటంటే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిన ఏకైక ఎంఎల్సీ అవకాశాన్ని జంగాకే ఇచ్చారు జగన్. దాదాపు ఆరేళ్ళ పదవీకాలాన్ని జంగా పూర్తిచేసుకోబోతున్నారు. జంగాకు జగన్ అంత ప్రాధాన్యతిచ్చినా ఇప్పుడు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు.
ప్రభుత్వ కాలపరిమితి అయిపోతున్న ఈ సమయంలో సడన్ గా ఎంఎల్సీకి జ్ఞానోదయం అయ్యింది. జగన్ హయాంలో బీసీలకు న్యాయం జరగలేదట. సామాజిక న్యాయం అన్నది కేవలం జగన్ మాటల్లోనే తప్ప ఆచరణలో ఎక్కడా చూపలేదట. జగన్ మీద బురదచల్లటానికి జంగా చాలా ఆరోపణలే చేశారు. ఒక్కసారిగా ఎంఎల్సీ జంగా కృష్ణమూర్తి జగన్ కు వ్యతిరేకంగా ఎందుకింతలా మాట్లాడినట్లు..? ఎందుకంటే.. రాబోయే ఎన్నికల్లో గురజాలలో టికెట్ ఆశించారు. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని కాదని జంగాకు టికెట్ ఇవ్వటం సాధ్యంకాదని జగన్ చెప్పేశారు.
దాంతో అప్పటినుండి జగన్ అంటే జంగాలో మంటపెరిగిపోయింది. అందుకనే జగన్ వ్యతిరేకంగా మాట్లాడి టీడీపీలో జంప్ అవటానికి రెడీ అయిపోయారు. గురజాలలో టికెట్ ఇవ్వటం కుదరదు కానీ, జిల్లాలో ఎక్కడో ఒక చోట టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారట. ఆ హామీని చూసుకునే జగన్ పైన ఎంఎల్సీ రెచ్చిపోతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. తనకన్నా ముందు టీడీపీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి పరిస్థితి ఏంటో అందరూ చూస్తున్నదే.
అలాగే కొలుసు పార్థసారధి, వసంత కృష్ణప్రసాద్ పరిస్థితి టీడీపీలో అయోమయంగా తయారైంది. టీడీపీలో చేరిన వైసీపీ విజయవాడ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పరిస్థితి ఏమైందో ఎవరికీ తెలీదు. తనకన్నా ముందే చంద్రబాబుతో మాట్లాడుకుని టికెట్లు ఖాయంచేసుకుని పార్టీలో చేరిన వాళ్ళ పరిస్థితే అయోమయంగా తయారైంది. వీళ్ళని చూస్తూ మళ్ళీ జంగా కూడా టీడీపీలో చేరాలని అనుకోవటమే విచిత్రంగా ఉంది. ఒకవైపు దెబ్బతిన్న వాళ్ళని ఇంతమందిని చూస్తూ కూడా మరికొంతమంది మళ్ళీ చంద్రబాబునే ఎలా నమ్ముతున్నారో అర్థంకావటంలేదు.