తారక్ జీవితంలో చాలా సీక్రెట్స్ ఉన్నాయి.. చంద్రబాబు వాడుకొని వదిలేశాడు: వల్లభనేని వంశీ
'జూనియర్ ఎన్టీఆర్‌కు ఎవరూ సపోర్ట్ చేయలేదు. అతడి జీవితంలో ప్రజలకు తెలియని ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు జూనియర్‌ను వాడుకొని వదిలేశాడు.
ఇటీవల తరచూ జూనియర్ ఎన్టీఆర్ పేరు రాజకీయాల్లో వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంపై తారక్ స్పందించినప్పటికీ తెలుగు తమ్ముళ్లు సంతృప్తి చెందలేదు.. అతడిపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో చంద్రబాబు అసెంబ్లీలో ఏడ్చినప్పుడు కూడా తారక్ ఇటువంటి విమర్శలే ఎదుర్కొన్నారు. మరోవైపు తారక్ ఫ్యాన్స్ కూడా టీడీపీ నేతల తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం తెలుగు తమ్ముళ్లు.. తారక్ ఫ్యాన్స్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ విషయంపై తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వంశీ స్పందించారు. తారక్ కు మద్దతుగా ఆయన మాట్లాడారు. 'జూనియర్ ఎన్టీఆర్‌కు ఎవరూ సపోర్ట్ చేయలేదు. అతడి జీవితంలో ప్రజలకు తెలియని ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు జూనియర్‌ను వాడుకొని వదిలేశాడు.
తారక్ స్వయంకృషితో పైకి ఎదిగాడు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విషయాన్ని అనవసరంగా రచ్చ చేస్తున్నారు. చంద్రబాబునాయుడికి నిజంగా ఎన్టీఆర్ పై ప్రేముంటే.. గన్నవరం ఎయిర్ పోర్టుకు ఆయన పేరుపెట్టేవాడు.. రాష్ట్రంలోని ఏదైనా జిల్లాకు పేరు పెట్టేవాడు. భారతరత్నకోసం ప్రతిపాదించేవాడు కదా.. హెల్త్ యూనివర్సిటీకి పేరు తీసేసినంత మాత్రాన ఎన్టీఆర్ ఖ్యాతీ ఏమీ తగ్గదు. ఆయన ఎప్పుడూ తెలుగు ప్రజల గుండెల్లోనే ఉంటారు' అంటూ వంశీ వ్యాఖ్యానించారు.