Telugu Global
Andhra Pradesh

లోకేష్‌కు రాచమల్లు కరెక్టు ఫిట్టింగ్

తనపైన లోకేష్ అండ్ కో చేస్తున్న ఆరోపణలపై వెంటనే విచారణ జరపాలని రిక్వెస్టు చేశారు. విచారణలో వాస్తవాలను బయటపెట్టాలని రాచమల్లు కోరారు. పనిలోపనిగా లోకేష్‌పై పరువునష్టం దావా వేయబోతున్నట్లు కూడా చెప్పారు.

లోకేష్‌కు రాచమల్లు కరెక్టు ఫిట్టింగ్
X

నారా లోకేష్‌కు కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి కరెక్టు ఫిట్టింగ్ పెట్టారు. తనపైన చేస్తున్న ఆరోపణలపై వెంటనే విచారణ జరపాలని స్వయంగా రాచమల్లే విశాఖపట్నంలోని సీబీఐ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే రాచమల్లు బెట్టింగులు, ఇసుక అక్రమ రవాణా, భూకబ్జాలు చేస్తు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నట్లు లోకేష్ పదే పదే ఆరోపణలు చేశారు. లోకేష్ చేసిన ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధంలేదని రాచమల్లు వివరణ ఇచ్చినా పట్టించుకోవటం లేదు.

రాచమల్లు వివరణ ఇచ్చినా పట్టించుకోకపోవటమే కాకుండా సిబీఐ విచారణకు సిద్ధమా అంటు చాలెంజ్ చేశారు. దాంతో మండిపోయిన రాచమల్లు తనంతట తానుగానే సీబీఐ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. తనపైన లోకేష్ అండ్ కో చేస్తున్న ఆరోపణలపై వెంటనే విచారణ జరపాలని రిక్వెస్టు చేశారు. విచారణలో వాస్తవాలను బయటపెట్టాలని రాచమల్లు కోరారు. పనిలోపనిగా లోకేష్‌పై పరువునష్టం దావా వేయబోతున్నట్లు కూడా చెప్పారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు చాలా సహజం. ఇలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణలకు జనాలు కూడా అలవాటు పడిపోయారు కాబట్టి పట్టించుకోవటంలేదు. నాలుగు రోజులు మీడియాలో గొడవ జరగటానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు. అలాంటిది తనపైన లోకేష్ చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే సీరియస్‌గా తీసుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. సీరియస్‌గా తీసుకోవటమే కాకుండా తనపైన విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలని స్వయంగా సీబీఐ ఎస్పీకి విజ్ఞ‌ప్తి చేయటం విచిత్రంగానే ఉంది.

ఒకవేళ సీబీఐ స్సందించినా స్పందించకపియినా ఎమ్మెల్కేకి వచ్చే నష్టం లేదు. ఎందుకంటే తనపైన సీబీఐ విచారణ జరపాలని స్వయంగా తానే రాతపూర్వ‌క‌ విజ్ఞప్తి చేశారు కాబట్టి. ఇదే సమయంలో లోకేష్‌పై పరువునష్టం దావా వేసేందుకు రాచ‌మ‌ల్లు రెడీ అవుతున్నారు. కాబట్టి ఎమ్మెల్యేపైన తాను చేసిన ఆరోపణలను నిరూపించే బాధ్యత లోకేష్ పైనే ఉంది. మరిపుడు లోకేష్ ఏమిచేస్తారనేది ఆసక్తిగా మారింది.

First Published:  16 Feb 2023 6:48 AM GMT
Next Story