Telugu Global
Andhra Pradesh

పవన్ శీలాన్ని అమ్ముకున్నాడు.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

చిరంజీవి ఎంతో పెద్దమనిషి అని, హుందాగా రాజకీయాలు చేశారని, ఆ హుందాతనం పవన్ లో లేదన్నారు ప్రసన్న. ఆ కుటుంబంలో పవన్ చెడ పుట్టాడంటూ మండిపడ్డారు.

పవన్ శీలాన్ని అమ్ముకున్నాడు.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

పవన్ కల్యాణ్ పొత్తుల వ్యవహారంపై వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. మేం సింగిల్ గానే పోటీ చేస్తామని చెబుతూనే.. మరోవైపు ప్రతిపక్షాల కలయిక అనైతికం అంటూ ఎద్దేవా చేస్తున్నారు వైసీపీ నేతలు. తాజాగా పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో మిగతా పార్టీలు కూడా కలుస్తాయని చెప్పిన ఆయన.. పవన్ కల్యాణ్ తన శీలాన్ని చంద్రబాబుకి అమ్మేశాడని మండిపడ్డారు. ప్రతిఫలంగా ఎన్ని వందల కోట్లు తీసుకున్నారో పవన్-చంద్రబాబుకే తెలుసన్నారు. కేవలం డబ్బులకోసమే పవన్, జనసేన పార్టీ పెట్టారని, చంద్రబాబు పాదాల దగ్గర దాన్ని తాకట్టు పెట్టారని సెటైర్లు వేశారు.

దమ్ముంటే నన్ను చెప్పుతో కొట్టు..

అసలు జనసేన పార్టీ అనేది ఉందా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే ప్రసన్న. వంగవీటి రంగాని చంపించింది చంద్రబాబు అవునో కాదో చెప్పాలని ఆయన పవన్ కల్యాణ్ అభిమానుల్ని ప్రశ్నించారు. ప్యాకేజీ స్టార్ అని అన్నవారిని చెప్పుతో కొడతానంటూ పవన్ ప్రగల్భాలు పలుగుతున్నారని.. ఆ మాట తాను అంటున్నానని తనని కొట్టడానికి కోవూరు వస్తాడా అని ప్రశ్నించారు ప్రసన్న. పవన్ కల్యాణ్ నిజంగానే ప్యాకేజీ స్టార్ అని అన్నారు ప్రసన్న.

ఆ కుటుంబంలో చెడబుట్టావ్..

చిరంజీవి ఎంతో పెద్దమనిషి అని, హుందాగా రాజకీయాలు చేశారని, ఆ హుందాతనం పవన్ లో లేదన్నారు ప్రసన్న. ఆ కుటుంబంలో పవన్ చెడ పుట్టాడంటూ మండిపడ్డారు. చంద్రబాబుకి జనసేనను అమ్మేశాడని ఎద్దేవా చేశారు. జగన్ ని ఓడించడానికి రంగాని చంపించిన చంద్రబాబుతో పవన్ ఎలా చేతులు కలుపుతారని ప్రశ్నించారు. పవన్ ని ప్రజలు క్షమించరని చెప్పారు. ఎంత‌మంది కలసి వచ్చినా జగన్ ని ఏమీ పీకలేరని వ్యాఖ్యానించారు ప్రసన్న.

First Published:  15 May 2023 2:42 PM IST
Next Story