Telugu Global
Andhra Pradesh

సమస్య అంతా సజ్జలతోనే

వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి విమర్శించారు. ఈ విషయాన్ని తాను బాహాటంగానే చెప్పానన్నారు. కానీ ఇది తట్టుకోలేని కొంతమంది తన మీద కక్ష గట్టారని ఆరోపించారు.

సమస్య అంతా సజ్జలతోనే
X

వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి ఏకచత్రాధిపత్యం కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను సీనియర్ పొలిటీషియన్‌నని.. ఎంతోమంది పెద్ద పెద్ద నేతల దగ్గర పనిచేశానని చెప్పారు. తనకు ఎప్పుడూ ఏ సమస్య రాలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని.. ఈ విషయాన్ని తాను బాహాటంగానే చెప్పానన్నారు. కానీ ఇది తట్టుకోలేని కొంతమంది తన మీద కక్ష గట్టారని ఆరోపించారు.

మామూలు వ్యక్తిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి .. ఇప్పుడు రూ.100 కోట్లకు ఎలా పడగెత్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన వైసీపీలో ఏకచత్రాధిపత్యం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. తాను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని చెప్పుకొచ్చారు. దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. మొత్తంగా ఆనంతో పాటు మరో రెబల్ ఎమ్మెల్యే శ్రీదేవి సజ్జలనే టార్గెట్ చేశారు. మరి ఈ పరిణామాలను సీఎం జగన్ ఎలా చూస్తున్నారో వేచి చూడాలి.

చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు సజ్జల తీరుతో ఇబ్బందులు పడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల మీడియాతో మాట్లాడిన మరో రెబల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. వైసీపీకి చెందిన 40 మందికి పైగా ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. మరి ఈ విషయాలన్ని జగన్ దృష్టికి వెళితే ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వైసీపీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలను ఎలా బుజ్జగిస్తారో వేచి చూడాలి.

First Published:  26 March 2023 2:18 PM IST
Next Story