Telugu Global
Andhra Pradesh

మాతో పెట్టుకుంటే మైండ్ బ్లాక్ –రోజా

చంద్రబాబుకి చేతకానిది సీఎం జగన్ చేసి చూపించారన్నారు. సీఎం జగన్ క్రేజ్ ఎలా ఉంటుందో ఇప్పటికైనా చంద్రబాబు అర్థం చేసుకోవాలన్నారు.

మాతో పెట్టుకుంటే మైండ్ బ్లాక్ –రోజా
X

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సక్సెస్ తో ఏపీలో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయిందని అన్నారు మంత్రి రోజా. గ్లోబల్ సమ్మిట్ పై వారంతా గోబెల్స్ ప్రచారం చేయాలనుకున్నారని, కానీ సమ్మిట్ సక్సెస్ చేసి తామేంటో నిరూపించామని, ప్రతిపక్షాలకు గట్టి సమాధానమిచ్చామని అన్నారు. గ్లోబల్ సమ్మిట్ తో ఏపీకి 13.41 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, 6 లక్షల మంది యువతకు ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పారు.

టీడీపీకి ఏడుపు..

గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ కావడంతో టీడీపీకి ఏడుపొక్కటే తక్కువైందని అన్నారు రోజా. పారిశ్రామిక దిగ్గజాలు విశాఖకు రావడాన్ని చూసి చంద్రబాబు, లోకేష్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఏనాడైనా ఇంత గొప్ప పారిశ్రామికవేత్తలు చంద్రబాబు హయాంలో సమ్మిట్‌ లకు వచ్చారా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకి చేతకానిది సీఎం జగన్ చేసి చూపించారన్నారు. సీఎం జగన్ క్రేజ్ ఎలా ఉంటుందో ఇప్పటికైనా చంద్రబాబు అర్థం చేసుకోవాలన్నారు.

పర్యాటక శాఖలో పెట్టుబడుల వెల్లువ..

పర్యాటక శాఖలో పెద్దఎత్తున పెట్టుబడుల కోసం ఎంవోయూలు చేశామని చెప్పారు మంత్రి రోజా. ఆ పెట్టుబడులన్నీ గ్రౌండింగ్‌ చేయడానికి రెండు కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. పారిశ్రామిక దిగ్గజాలు రావడం తమ ప్రభుత్వం బ్రాండ్ ఇమేజ్‌ కి నిదర్శనం అని చెప్పారు. అంబానీ, అదాని, దాల్మియా, జిందాల్ వంటి పారిశ్రామికవేత్తలు సీఎం జగన్ పాలన చూసి వచ్చారన్నారు. టూరిజం శాఖలో ఎంవోయూలు గ్రౌండ్ చేయడానికి రెండు కమిటీలు వేశామన్నారు. పర్యాటక శాఖలో పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం ఎంవోయూలు చేసుకున్నామని చెప్పారు. ఒబెరాయ్ లాంటి సంస్థలు పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయని వివరించారు.

First Published:  7 March 2023 4:17 PM GMT
Next Story