పవన్ కల్యాణ్, రోజా.. మధ్యలో సన్నీలియోన్
పవన్ నీతులు మాట్లాడితే సన్నీలియోన్ వేదాలు వల్లించినట్టుగా ఉంటుందన్నారు మంత్రి రోజా. పనికిమాలిన పీకే జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.
పవన్ కల్యాణ్ పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా. వాలంటీర్ల విషయంలో పవన్ చేసిన ఆరోపణలను ఆమె తిప్పికొట్టారు. కరోనా టైమ్ లో చంద్రబాబు, పవన్ హైదరాబాద్ లో కూర్చుంటే.. ఇక్కడ ప్రజలకు సేవలందించింది వాలంటీర్లేనని చెప్పారు. ఇప్పుడు పవన్ మాటలకు విజిల్స్ వేస్తూ, చప్పట్లు కొడుతున్న వారి అనుచరులు కూడా వాలంటీర్ల సేవలు అందుకున్నవారేనన్నారు రోజా. చంద్రబాబు పూనిన చంద్రముఖిలాగా పవన్ కల్యాణ్ పిచ్చి గంతులు వేస్తున్నారని మండిపడ్డారు.
పవన్ నీతులు చెబితే..
అసలు పవన్ తల్లి గురించి గానీ, పెళ్లాం గురించి గానీ ఎవరు తప్పుగా మాట్లాడారని ప్రశ్నించారు మంత్రి రోజా. పవన్ నీతులు మాట్లాడితే సన్నీలియోన్ వేదాలు వల్లించినట్టుగా ఉంటుందన్నారు. పనికిమాలిన పీకే జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. సంస్కారం గురించి మాట్లాడే అర్హత పవన్ కి ఎక్కడిదన్నారు. పవన్ పనికిమాలినోడని, ఆయన మాటలు వింటే లాగిపెట్టి కొట్టాలనిపిస్తోందన్నారు.
నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా..?
జన్మభూమి కమిటీలతో అర్హులకు చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేసినప్పుడు పవన్ ఏమైపోయారని నిలదీశారు రోజా. అప్పుడు పవన్ నోరు ఎందుకు తెరవలేదని, నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నాడా అంటూ మండిపడ్డారు. సచివాలయ వ్యవస్థ గురించి పవన్ కి తెలియదని, పవన్ శాసనసభకు వచ్చి ఉంటే ఆ చట్టం గురించి తెలిసి ఉండేదని అన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం మాత్రమే పవన్ కి వచ్చని ఎద్దేవా చేశారు.